close

తాజా వార్తలు

Updated : 27/01/2020 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన దగ్గరా...సెలూన్‌ లైబ్రరీ!

క్షౌరశాలకు వచ్చిన వారి కళ్లు తొలుత అద్దం ముందున్న సీటు మీద పడతాయి. అది ఖాళీగా లేకపోతే.. ఇటువైపు టేబుల్‌ మీదున్న దినపత్రిక వైపు చూపు తిరుగుతుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న సినీపత్రికల పైకి మనసు మళ్లుతుంది. పత్రికలు చదవడానికి మాత్రమే క్షౌరశాలకు వచ్చేవాళ్లు ఉంటారు. హన్మకొండ బస్టాండు సమీపంలోని జంపాల రాజుకు చెందిన సౌమ్యశ్రీ సెలూన్‌లోకి వెళ్తే.. దినపత్రికలు పలకరిస్తాయి. బాపూజీ జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఆకర్షిస్తాయి. వివేకానందుడి విశేషాలతో నిండిన పుస్తకాలు చదవమంటాయి. రాబిన్‌శర్మ, జోసెఫ్‌మర్ఫీ వంటి రచయితల గ్రంథాలు ఆసక్తి కలిగిస్తాయి. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా రెండొందల పుస్తకాలతో మినీ గ్రంథాలయాన్ని మరిపిస్తుంటుందీ క్షౌరశాల. ఇదిలా మారడం వెనుక ఆసక్తికరమైన సంఘటన ఉంది. వరంగల్‌కు చెందిన రాజు 2010లో సెలూన్‌ను ప్రారంభించాడు. అతడు చదువుకుంది పదో తరగతి వరకే! స్వామీ వివేకానంద 150వ జయంతి సందర్భంగా రాజు కూతురుకు పాఠశాలలో కొన్ని పుస్తకాలు ఇచ్చారు. కాలక్షేపం కోసం వాటిని చదివాడు రాజు. అవి అతడిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పుస్తకాలు చదవాలనే ఆసక్తిని పెంచాయి. ఆనాటి నుంచి మంచి మంచి పుస్తకాలు కొనడం.. చదవడం చేసేవాడు. చదివిన పుస్తకాలను తన సెలూన్‌లో ఉంచేవాడు. అలా 200కు మించి పుస్తకాలు కొనుగోలు చేశాడు. సెలూన్‌కు వచ్చే కస్టమర్లే కాదు.. ఎవరైనా ఈ పుస్తకాలు చదువుకోవచ్చు. అతడి వినూత్న ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు. కస్టమర్లయితే.. అద్దం ముందు సీటు ఖాళీగా ఉందా? లేదా? అని చూడకుండా.. ముందుగా నచ్చిన పుస్తకం వెదుకులాటలో పడుతున్నారు.

                                                                                        

- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఈనాడు జర్నలిజం స్కూల్‌

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.