close

తాజా వార్తలు

Published : 28/01/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతులకు రూ. 12వేల కోట్లు.. ఓ రికార్డు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

గాంధీనగర్‌: కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 6 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 12వేల కోట్లు బదిలీ చేసి ఈ ఏడాది ఆరంభంలో కొత్త రికార్డు సృష్టించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న గ్లోబల్‌ పొటాటో కాంక్లేవ్‌లో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రైతుల కఠిన శ్రమ, ప్రభుత్వ విధానాల వల్లే ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల ఉత్పత్తిలో భారత్‌ టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా నిలిచిందని కొనియాడారు. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులను ఆదుకోవడం కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తీసుకొచ్చామని, దాని ద్వారా జనవరి ఆరంభంలో 6 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 12వేల కోట్లను నేరుగా బదిలీ చేశామని తెలిపారు. నీటిపారుదలలో శాస్త్ర, సాంకేతిక విధానాలను అవలంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ‘పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌’, మైక్రో ఇరిగేషన్ విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.