నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రాహుల్‌ బజాజ్‌
close

తాజా వార్తలు

Updated : 30/01/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రాహుల్‌ బజాజ్‌

దిల్లీ: బజాజ్‌ ఆటోమొబైల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌ బజాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఛైర్మన్‌ బాధ్యతల్లో కొనసాగనున్నారని ఆ కంపెనీ తెలిపింది. 1970 ఏప్రిల్‌ 1 నుంచి రాహుల్‌ బజాజ్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. 2015 ఏప్రిల్‌లో డైరెక్టర్‌గా పునర్నియమితులయ్యారు. ఈ పదవీకాలం కూడా 2020 మార్చి 31తో ముగియనుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ గడువు పూర్తవ్వగానే కంపెనీ పూర్తి స్థాయి డైరెక్టర్‌గా కొనసాగబోరని తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఛైర్మన్‌ బాధ్యతల్లో కొనసాగేందుకు గురువారం బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు కంపెనీ పేర్కొంది.

1965 బజాజ్‌ గ్రూప్‌ వ్యాపారంలో అడుగుపెట్టిన రాహుల్‌ బజాజ్‌ కంపెనీని ప్రగతి పథంలో దూసుకెళ్లేలా చేశారు. కంపెనీ టర్నోవర్‌ను రూ.7.2 కోట్ల నుంచి రూ.12వేల కోట్లకు చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2005లో రాహుల్‌ బజాజ్‌ కుమారుడు రాజీవ్‌ బజాజ్‌ కంపెనీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కంపెనీ విదేశాల్లో సత్తా చాటుతోంది. దిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన రాహుల్‌ బజాజ్‌.. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని