close

తాజా వార్తలు

Published : 30/01/2020 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడ్జెట్‌2020: మార్కెట్‌ పల్స్‌ ఇలా..!

 స్టాక్‌ మార్కెట్‌ అంచనాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ ఎలా ఉందో పెద్దగా విశ్లేషణలు అవసరం లేదు.. స్టాక్‌ మార్కెట్లు క్షణాల్లో చెప్పేస్తాయి. ప్రభుత్వ వ్యయాలు బాగుండి వ్యవస్థలోకి నగదు ప్రవాహం ఉండేలా చూస్తే మార్కెట్లు తారాజువ్వలా పెరుగుతాయి. ఆత్మరక్షణ వ్యూహంతో సాగే బడ్జెట్లు వస్తే మార్కెట్లు భారీగా కుంగుతాయి. గత ఏడాది ఎన్నికల తర్వాత జులై5న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాక మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. దానికి అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థ కూడా మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి జారిపోయింది. అప్పట్లో ఎఫ్‌పీఐలపై విధించిన పన్ను మార్కెట్లను భయపెట్టింది. దీంతోపాటు పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ప్రజల షేర్ల వాటాలను పెంచాలనే నిర్ణయంతో ప్రమోటర్ల షేర్ల అమ్మకాలు వెల్లువెత్తుతాయని భయపడ్డారు. ఈ సారి ప్రభుత్వం అటువంటి నిర్ణయాలను  ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఎల్‌టీసీజీపైకానీ, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌పైకానీ, మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆరు రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉంటాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఆటోమొబైల్‌ అశించేవి..

* ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్‌ ‘తక్కుపాలసీ’ని ప్రవేశపెడతారని భావిస్తున్నారు. 
* లిథియం అయాన్‌ సెల్స్‌పై దిగుమతి సుంకం తొలగింపు
* టైర్ల దిగుమతులపై సుంకం పెంపు
* రాష్ట్ర రవాణ కార్పొరేషన్ల బస్సుల కొనుగోళ్లు పెంపు

లబ్ధి ఇలా..

అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌ కంపెనీల డిమాండ్‌ పెరిగేందుకు ‘తుక్కు పాలసీ’ విధానం ఉపయోగపడుతుంది. ఇక వ్యక్తిగత పన్ను ఆటోమొబైల్‌ రంగంలోని వివిధ విభాగాలపై చూపుతుంది. ఇక లిథియం అయాన్‌పై సంకం తొలగింపు టాటామోటార్స్‌, మహీంద్రా, మారుతీ వంటి కంపెనీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక టైర్ల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచితే సియాట్‌, ఎమ్మారెఫ్‌, అపోలో టైర్లకు లబ్ధికలుగుతుంది.

లోహరంగానికి..

* లోహరంగంలో వినియోగించే కోకింగ్‌ కోల్‌, మెట్‌ కోల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలి. 
* అల్యూమినియం స్క్రాప్‌పై దిగుమతి సుంకాన్ని పెంచాలి. 
* డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను తగ్గించాలి. 

లబ్ధి ఇలా..
 కోకింగ్‌ కోల్‌పై దిగుమతి సుంకం తగ్గింపుతో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌పీఎల్‌, సెయిల్‌ వంటి కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం బొగ్గుపై టన్నుకు రూ.400 సెస్సు వసూలు చేస్తున్నారు. ఇక అల్యూమినియం దిగుమతి సుంకం పెంచితే హిందాల్కో, వేదాంత, నాల్కో కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుంది.
 
రియల్‌ ఎస్టే్ట్‌ రంగానికి..

* అందుబాటులో ఉండే గృహాలు అనే దానికి వివరణ విస్తృతం చేయాలి.
* తొలిసారి ఇల్లు కొనే వారికి జీఎస్‌టీలో రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలి
* గృహరుణాలపై చెల్లించే వడ్డీకి పన్ను రాయితీ ఇవ్వాలి.

లబ్ధి ఇలా..
గృహరుణాలు ఇచ్చే సంస్థలకు వ్యాపారం  పెరుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి డిమాండ్‌ లభిస్తుంది. అందుబాటులో ఉండే గృహాల వివరణను విస్తృతం చేస్తే పెద్ద ప్రాజెక్టులు కూడా దీనికి కిందకు వస్తాయి.  అప్పుడు వీటికి కూడా డిమాండ్‌ పెరుగుతుంది. 

వ్యవసాయ రంగం..

* ఎరువులపై రాయితీని నేరుగా రైతు ఖాతాల్లో వేసి.. ఎరువులపై నియంత్రణను తొలగిస్తారు. 
* యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులపై రాయితీని పెంచాలి.
* ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన, మన్రేగా, వ్యవసాయ పరపతి, సూక్ష్మనీటిపారుదల కేటాయింపులు పెంచాలి

లబ్ధి ఇలా..
ఒక వేళ సబ్సిడీలను పెంచితే కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, జీఎస్‌ఎఫ్‌సీ, చంబల్‌ ఫర్టిలైజర్స్‌, ఆర్‌సీఎఫ్‌, ఇఫ్కో వంటి సంస్థలు లబ్ధిపొందుతాయి. మైక్రో ఇరిగేషన్‌పై తీసుకొనే నిర్ణయాలు జైన్‌ ఇరిగేషన్‌ వంటి సంస్థలను ప్రోత్సహిస్తాయి.

మౌలిక వసతుల రంగం(ఇన్ఫ్రా)

* మూలధన వ్యయాలు 10-12శాతం పెంచాలి
*  జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా కేటాయింపులు పెంచాలి
* మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్‌ పెంచాలి

లబ్ధి ఇలా..
జాతీయ రహదారులకు నిధులను పెంచితే దిలిప్‌ బిల్డ్‌కాన్‌, అశోక్‌ బిల్డ్‌కాన్‌, పీఎన్‌సీ ఇన్ఫ్రా, హెచ్‌జీ ఇన్ఫ్రా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా వంటి ఇతర సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటాయి. దీంతోపాటు సిమెంట్‌ వినియోగం పెరిగి అల్ట్రాటెక్‌, శ్రీసిమెంట్‌, రామ్‌కో సిమెంట్‌, జేకే లక్ష్మీ వంటి సంస్థలకు డిమాండ్‌ పెరుగుతుంది. మెట్రో ప్రాజెక్టులపై వ్యయాల పెంపు ఎల్‌అండ్‌టీ, జె.కుమార్‌ ఇన్ఫ్రా వంటి సంస్థలపై ప్రభావం చూపిస్తుంది. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.