close

తాజా వార్తలు

Published : 31/01/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వెనుక ‘ఆగంతక’ జీవి!

బీజింగ్‌: చైనాతో సహా ఇతర దేశాలను ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్‌ (నావల్‌ కరోనా వైరస్‌ -2019) వణికిస్తున్న వేళ.. అది ఎలా మనుషులకు ఎలా సోకిందనే విషయాన్ని కనుగొనే పనిలో పడ్డారు పరిశోధకులు. ఈ వైరస్‌ పుట్టుక గబ్బిలాల్లోనే ఉన్నప్పటికీ, మనుషుల్లోకి ప్రవేశించడం వెనుక ఓ ‘ఆగంతక’ జీవి పాత్ర ఉన్నట్లు ల్యాన్సెంట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనాలోని షాన్‌డాంగ్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులతో కూడిన బృందం ఈ పరిశోధనలు చేపట్టింది. తాజా వైరస్‌కు గతంలో ‘సార్స్‌’ కరోనా వైరస్‌లకు దగ్గర పోలికలు ఉన్నాయయని, ఈ వైరస్‌ బారిన పడిన రోగులను పరీక్షించిన అనంతరం నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు. గబ్బిలాల నుంచే ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అయితే, హువానన్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌లో విక్రయించిన ఓ జీవి మనుషుల్లో చొరబడడానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పరిశోధకులు తెలిపారు. 

అసలు ఈ వైరస్‌ మనిషి శరీరంలోకి ఎలా ప్రవేశించిందనే దాని కోసం న్యుమోనియాతో బాధపడుతున్న 9 మందికి పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి శాంపిళ్లను సేకరించారు. వారిలో 8 మంది హువానన్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌కు వెళ్లినట్లు తేలింది. మరొకరు మాత్రం ఆ మార్కెట్‌కు దగ్గర్లోనే ఉన్న ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు.  అతి తక్కువ సమయంలో సోకిన ఈ వైరస్‌ వేగంగా మరింత మందికి వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు తెలిపారు. నియంత్రించేందుకు గట్టి నిఘా అవసరమని అభిప్రాయపడ్డారు. దీనంతటికీ హువానన్‌ మార్కెట్‌లో విక్రయించిన ఓ ఆగంతక జీవినే కారణమనిపేర్కొన్నారు. గబ్బిలాలకు, మనుషులకు మధ్య అదో వాహకంలా పనిచేసిందని తెలిపారు. అయితే, 2019 డిసెంబర్‌లో తొలుత ఈ వైరస్‌ బయట పడగా.. ఆ సమయంలో ఆ మార్కెట్‌లో గబ్బిలాలు విక్రయించలేదని పరిశోధకులు తెలిపారు. అయితే, క్షీరదాలతో పాటు ఇతర జంతువులు విక్రయించినట్లు గుర్తించారు. ఇంతకీ ఆ జీవి ఏదన్నది అంతుబట్టడం లేదు.

ఇదీ చదవండి..

జలుబు కిరీటం మనకేల?

భారత్‌లో తొలి ‘కరోనా’కేసు నమోదు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.