close

తాజా వార్తలు

Updated : 31/01/2020 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పూజలు చేస్తామని..రూ.లక్షలు నొక్కేశారు!

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: అనార్యోగంతో బాధపడుతున్న దంపతులను పూజలు చేసి బాగుచేయిస్తానని నమ్మించి మోసం చేసిన ఇద్దరి నిందితులను గురువారం సీసీఎస్‌, సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమాలపూర్‌ మండలం వంగర గ్రామానికి చెందిన కొలిపాక పద్మ అలియాస్‌ రేణుక ప్రస్తుతం జులైవాడలో నివసిస్తున్నారు. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన తులిసేగారి రాజబాబు ఎక్సైజ్‌కాలనీలో ఉంటున్నారు. వంగర గ్రామంలోని ఇళ్లల్లో పనిచేస్తూ జీవించే పద్మ పట్టణానికి వలస వచ్చి జులైవాడలో నివసిస్తోంది. అక్కడే నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముంజ వెంకటస్వామి ఇంట్లో 2017 నుంచి పద్మ పని చేసేది. తాను రేణుకమాత భక్తురాలినని ప్రచారం చేసుకుంది. వెంకటస్వామి కూతురికి బాబు జన్మించగా తరుచూ అనారోగ్యంతో బాధపడేవాడు. గమనించిన పద్మ చిన్నారి కోసం పూజలు చేస్తానని నమ్మబలికింది. దీంతో వెంకటస్వామి దంపతులు 2018 అక్టోబర్‌ నెలలో పద్మకు రూ. 4 లక్షలు ఇచ్చారు. బాలుడి ఆరోగ్యం కుదటపడడంతో పద్మ బాధిత కుటుంబీకులతో సాన్నిహిత్యం పెంచుకుంది. ఈక్రమంలో బాధితుల బంధువులను నమ్మించి పూజల నిమిత్తం రూ. 5 లక్షలు తీసుకుంది. మరోసారి వెంకటస్వామి వదిన కుమారుడికి చేతబడి చేశారని చెప్పి వారి నుంచి రూ. 11 లక్షలు తీసుకుంది. వెంకటస్వామికి గత ఏడాది గుండెనొప్పి రావడంతో రూ. 25 లక్షలు ఇస్తే పూజలు చేస్తానని చెప్పింది. బాధితులు అంగీకరించగా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డబ్బులు ఇవ్వాలని వెంకటస్వామి భార్య అన్నపూర్ణకు తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన వెంకటస్వామి ఇంటికి పద్మ, రాజబాబు ఇద్దరు కలిసి వెళ్లి పూజల కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశారు. దంపతులను బంధించి బలవంతంగా రూ. 10 లక్షలు నగదు తీసుకున్నారు. వెంకటస్వామి ఉద్యోగవిరమణ తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలని రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు కాగితాలు రాయించుకున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఇంటిని జప్తు చేసుకుంటామని దస్తావేజులు, ఖాళీ చెక్కులను నిందితులు తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నిందితులు తిరిగి బాధితుల ఇంటికి వెళ్లి రూ. 15 లక్షలకు వడ్డీ చెల్లించాలని బాధిత ఇంట్లో ఉన్న బంగారు నగలు, తీసుకున్నారు. 2019 నవంబర్‌లో బాధితుల నుంచి రూ. 10 లక్షలు, డిసెంబర్‌లో రూ. 5 లక్షలు తీసుకొని ముందుగా రాయించుకున్న దస్తావేజులు, కాగితాలు ఇవ్వకుండా వెళ్లారు. జనవరి 6వ తేదీన బాధితుని ఇంటికి వచ్చి విదేశాల్లో ఉన్న మీ కుమారుడికి ప్రాణగండం ఉందని దేవత పూజల కోసం రూ. 2 కోట్లు కావాలన్నారు. తమ దస్తావేజులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరగా వారిని పద్మ, రాజబాబు బెదిరించి వెళ్లిపోయారు. బాధితులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారం, దస్తావేజులు, చెక్కులు, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సకాలంలో అరెస్టు చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ వి. రవీందర్‌ అభినందించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.