
తాజా వార్తలు
మరో దిగ్గజ కంపెనీకి సీఈఓగా భారతీయుడు
వాషింగ్టన్: అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓల జాబితాలో మరో భారతీయుడు చేరారు. అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వర్జీనియా రొమెట్టీ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో అరవింద్ కృష్ణని నియమిస్తూ ఐబీఎం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
అరవింద్ (57) ప్రస్తుతం కంపెనీ ‘క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్’ విభాగానికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. లైనక్స్ వంటి ప్రముఖ ఆపరేటింగ్ టెక్నాలజీని అందించిన ‘రెడ్ హ్యాట్’ కొనుగోలులో అరవింద్ కీలకపాత్ర పోషించారు. భవిష్యత్తును శాసించబోయే ‘హైబ్రిడ్ క్లౌడ్’ సాంకేతికత ప్రాముఖ్యతను ముందుగానే గ్రహించిన అరవింద్ రెడ్ హ్యాట్ కొనుగోలు ప్రతిపాదనని బోర్డు ముందుంచి వారిని ఒప్పించారు. అలాగే ఐబీఎం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ, ‘క్లౌడ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్’ సాంకేతికతలో కీలకంగా వ్యవహరించారు. రానున్న దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకోబోతున్న తరుణంలో అరవింద్ కంపెనీ బాధ్యతలు స్వీకరించనుండడం పట్ల వ్యాపారవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు ఐబీఎం నాయకత్వ మార్పుపై మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఓ దశలో ఐబీఎం షేర్లు ఐదు శాతం మేర లాభపడ్డాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
- భలే పంత్ రోజు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
