close

తాజా వార్తలు

Updated : 31/01/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచ పరిస్థితుల కారణంగా మందగమనం

ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌

న్యూదిల్లీ: ‘‘ఆరు నెలల్లో ప్రవేశపెడుతున్న రెండో ఆర్థిక సర్వే ఇది. ఈసారి సర్వే థీమ్‌ వెల్త్‌ క్రియేషన్‌. ఆగస్టు15న ప్రధాని సంపద సృష్టిపై మాట్లాడారు. సంపద సృష్టికర్తలను గౌరవించాలి. వారు సంపదను సృష్టించకపోతే.. సంపదను పంచలేం. ఆర్థిక సర్వే కవర్‌ను రూ.100 నోటు పై నుంచి తీసుకొన్న ఊదారంగును వాడాం. పాత కొత్తల ఆలోచన కలయికే ఈ ఆర్థిక సర్వే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో.. భారత ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. నాన్‌-ఫుడ్‌ క్రెడిట్‌ విభాగంలోని కార్పొరేట్‌ రుణాలు 2013లో అత్యధికంగా ఉన్నాయి.. ఆ తర్వాత బాగా తగ్గాయి. పెట్టుబడులు తగ్గాయి. ఇది జీడీపీపై ప్రభావం చూపింది’’ అని సీఈఏ సుబ్రమణియన్‌ అన్నారు. ఆర్థిక సర్వేను నేడు విలేకర్లకు వివరించారు. ఈ సందర్భంగా పలు ఇన్ఫోగ్రాఫ్స్‌ను ప్రదర్శించారు. 

ప్రజల వినిమయం తగ్గడం, ఎన్‌బీఎఫ్‌సీలు ఒత్తిడికి గురికావడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, తక్కువ పన్ను ఆదాయాలు వంటి వాటికి అత్యవసర చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు.  సంపద సృష్టికర్తల నుంచి ప్రతి ఒక్కరు లబ్ధిపొందారని రుజువైందని తెలిపారు. ఒక పెద్ద సంస్థ పద్దులు బాగోకపోతే.. దాని ప్రభావం మిగిలిన వాటిపై కూడా పడుతుందన్నారు. చైనాలో కార్మికులు ఎక్కువగా అవసరమైన రంగాలు ఉన్నాయి.. భారత్‌లో కూడా అలాంటి రంగాల అవసరం ఉందన్నారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేకపోతే మనం సామాజిక కార్యక్రమాలపై రెట్టింపు మొత్తాన్నివెచ్చించే వారమని చెప్పారు. మనం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మార్కెట్లోని పరోక్షశక్తులను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకొన్న వ్యాపార అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని స్టాక్‌ మార్కెట్లు వెల్లడిస్తున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.