close

తాజా వార్తలు

Published : 01/02/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్‌గెజిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష

దిల్లీ: నాన్‌ గెజిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు యువత నాన్‌ గెజిటెడ్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు వివిధ పరీక్షలను రాస్తూ వస్తోంది. ఇక నుంచి అలా కాకుండా ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.

ఈ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నాన్‌ గెజిటెడ్‌ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలను చూసుకుంటూ అన్నింటికీ కలిపి ఒకే పరీక్షను నిర్వహించనుంది. ప్రస్తుతం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం భారంగా మారిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఉమ్మడి పరీక్షను నిర్వహించేందుకు ప్రతీ జిల్లాలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.