close

తాజా వార్తలు

Updated : 01/02/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘భారీ’ ఆశలు లేని బడ్జెట్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. కాకపోతే ఆదాయ పన్ను, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌, ఇతర పన్నుల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగానికి ప్రధానమైన ప్రకటనలు ఏమీ చేయలేదు. గ్రామీణ ప్రాంతాలపైనే దీనిలో దృష్టి పెట్టారు. బంగారంపై సుంకాన్ని తగ్గించలేదు. వ్యవసాయ రంగానికి రూ.15లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవీ.. 

*  ఈ బడ్జెట్‌ మూడు కీలక ఇతివృత్తాలతో తయారు చేశారు. 

1 ఆశావాహ భారత్‌.. ఇది ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడం

2 అందరికి ఆర్థికవృద్ధి 

3 సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం

*  2006-16 మధ్య దాదాపు 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

* కేంద్ర ప్రభుత్వం రుణం మార్చి 2019నాటికి 48.7శాతానికి తగ్గింది. 2014 మార్చిలో ఇది 52.2శాతం ఉంది.

* భారత్‌ ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

* ఆశావాహ భారత్‌గా మార్చేందుకు 16 పాయింట్లతో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం.

* 2020-21లో రూ.15లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. 

* దేశవ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజ్‌ గొలుసుకట్టు వ్యవస్థను అభివృద్ధి చేయడం.

* పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ‘కిసాన్‌ రైల్‌’ ఏర్పాటు

* ఉపాధి హామీ పథకాన్ని పశుగ్రాస భూముల అభివృద్ధికి ఉపయోగిస్తాము.

* 2014-19 మధ్య ఎఫ్‌డీఐలు 284 బిలియన్‌ డాలర్లు పెరిగాయి.

* ఇంద్రధనుష్‌ పథకాన్ని విస్తరించి ఆయుష్మాన్‌ భారత్‌కు అదనపు ఆసుపత్రులను జోడిస్తాము.

* ఇళ్లకు కుళాయి నీళ్లు ఇచ్చేందుకు రూ.3.6లక్షల కోట్లు కేటాయింపు

* స్వచ్ఛభారత్‌ కోసం 2020-21లో రూ.12,300 కోట్లు కేటాయింపు

* విద్యాభివృద్ధికి రూ.99,300 కోట్ల కోట్ల కేటాయింపు. దీనిలో నైపుణ్యాల పెంపునకు రూ.3,000 కోట్లు.

* పాదాలు, నోటికి సంబంధించిన వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. 

* యువ ఇంజినీర్లు స్థానిక సంస్థలు చేపట్టే ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు.

* నేషనల్‌ పోలీస్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ఏర్పాటు . 

* ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తాము. 

* నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ.1,480 కోట్లు కేటాయింపు

* త్వరలో ప్రకటించే నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీ ఎంఎస్‌ఎంఈల మధ్య పోటీతత్వం పెంచుతుంది. 

* ఐదు కొత్త స్మార్ట్‌ సిటీల అభివృద్ధి

* భారత్‌లో మరిన్ని ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తాము.

*  మరిన్ని తేజస్‌ రైళ్లను ఏర్పాటు చేస్తాము. దీంతోపాటు కిసాన్‌ రైల్‌ను ప్రారంభిస్తాం. పౌర విమానయాన సంస్థ సాయంతో కిసాన్‌ ఉడాన్‌ విమానాలు తీసుకొస్తాము. ఇది జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో విటిని నిర్వహిస్తుంది. 

* ప్రైవేటు డేటా సెంటర్ల ఏర్పాటుకు పాలసీని త్వరలో తీసుకొస్తాము.

* తరగిపోని ఇంధన వనరుల కోసం రూ.20,000 కోట్ల కేటాయింపు.

* దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేను మరో 3ఏళ్లలో సిద్ధం  చేస్తాము.

*  మరో 100 విమానాశ్రయాలను 2025 నాటికి అభివృద్ధి చేస్తాము.

* నేషనల్‌ మిషన్‌ ఆన్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ టెక్నాలజీకి రూ.8వేల కోట్ల కేటాయింపు

*  డిస్కమ్‌లు సంప్రదాయ మీటర్లను స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ మీటర్స్‌తో మార్పు చేస్తాము.

* ఆరు లక్షల మంది అంగన్‌ వాడీ పనివారికి స్మార్ట్‌ ఫోన్లు సమకూరుస్తారు. వీటిల్లో 10 కోట్ల కుటుంబాల న్యూట్రీషియన్‌ స్థితిని అప్‌లోడ్‌ చేస్తారు. 

* భారత్‌ నెట్‌కు రూ.6,000 కోట్ల కేటాయింపు. ఏడాదిలో లక్ష పంచాయతీలను భారత్‌ నెట్‌కు అనుసంధానిస్తారు. 

*  సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల సంక్షేమానికి రూ.9,500 కోట్ల కేటాయింపు

* ఐదు వారసత్వ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మ్యూజియంల  ఏర్పాటు. 

*  ‘నిర్విక్‌ పథకం’ కింద ఎగుమతిదారులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. 

* పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.2,500 కోట్ల కేటాయింపు

* 2022లో జీ-20కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.100 కోట్ల కేటాయింపు.

* నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల ఎంపికల కోసం నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ఏర్పాటు.

* ఆదివాసుల సంక్షేమానికి రూ.53,700 కోట్ల కేటాయింపు

*  జమ్ము-కశ్మీర్‌కు రూ.30,757 కోట్ల కేటాయింపు. లద్దాఖ్‌కు రూ.5,958 కోట్ల కేటాయింపు.

* బ్యాంక్‌ డిపాజిట్లపై బీమాను రూ.5 లక్షలకు పెంచాము. 

*  కార్పొరేట్‌ బాండ్లలో ఎఫ్‌పీఐలను 9శాతం నుంచి 15శాతానికి పెంపు

* బ్యాంకులు మరో ఏడాది రుణ వ్యవస్థీకరణతో 5లక్షల ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి

* 2020-21కి ద్రవ్యలోటు 3.5శాతంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి 3.8శాతంగా అంచనావేస్తున్నాం. 

* ఐడీబీఐలో వాటాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తాము.

* పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి ప్రభుత్వం పెన్షన్‌ ట్రస్ట్‌ వేరు చేయడానికి చట్టసవరణలు చేస్తాము. 

* ఎల్‌ఐసీలో వాటాల విక్రయం

* ఎన్‌బీఎఫ్‌సీలకు తాత్కాలిక రుణ హామీ 

* నాన్‌రెసిడెంట్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు అనుమతి

* ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం సబ్‌ఆర్డినేట్‌ రుణాలు సమకూరుస్తుంది. 

* 2020-21 నామినల్‌ జీడీపీ 10శాతంగా ఉంటుందని అంచనా వేశాము.

* సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్‌ రెగ్యులేటింగ్‌ చట్టాన్ని బలోపేతం చేస్తాము. 

* మార్చిన అంచనాల ప్రకారం 2019-20లో ఖర్చులు రూ.26.99 లక్షల కోట్లు.. ఆదాయం రూ.19.32లక్షల కోట్లుగా అంచానా. 

* ఆదాయపు పన్నులో కీలక మార్పులు

0-రూ.2.5లక్షలకు పన్నులేదు

రూ.2.5లక్షలు-రూ.5లక్షలకు 5శాతం

రూ.5లక్షలు - రూ.7.5లక్షలకు 10శాతం 

రూ.7.5లక్షలు-రూ.10 లక్షలకు 15శాతం

రూ.10లక్షలు-రూ.12.5లక్షలకు 20శాతం

రూ.12.5లక్షలు-రూ.15లక్షలకు 25శాతం

రూ.15లక్షలు నుంచి 30శాతం 

పాత విధానంలో మినహాయింపులు, డిడక్షన్లకు దరఖాస్తు చేసుకొంటే పాత విధానంలో చెల్లించాలి. కొత్త విధానంలో రూ.40వేల కోట్ల ఆదాయానికి కోత పడుతుంది. లేకపోతే కొత్త విధానంలో ఎటువంటి క్లెయింలు లేకుండా చెల్లించాలి. కొత్త విధానం సులువుగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలో 100 డిడక్షన్లలో 70 తొలగించాము. 

* పవర్‌ జనరేషన్‌ కంపెనీలు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వర్తిస్తుంది. కొత్త పవర్‌ జనరేషన్‌ కంపెనీలపై 15శాతం మాత్రమే పన్ను విధిస్తారు. 

* ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో సావరనీ వెల్త్‌ ఫండ్‌ల పెట్టుబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు 

కో-ఆపరేటివ్‌ సొసైటీలపై 22శాతం  పన్ను, సర్‌ఛార్జి మాత్రమే విధిస్తారు. ప్రస్తుతం వీటిపై 30శాతం పన్ను విధిస్తున్నారు. 

* ఆధార్‌ను తీసుకొని ఇన్‌స్టెంట్‌గా ‘పాన్‌’ను జారీ చేసే వ్యవస్థ ఏర్పాటు. 

* వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద వివిధ సంస్థలకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు చేసుకొనే అవకాశం  ఇచ్చారు. 

* చౌక గృహాల నిర్మాణానికి టాక్స్‌హాలిడే  కొనసాగింపు 

* కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను తొలగింపు



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.