close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/02/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
టీఎస్‌ఎస్‌డీసీఎల్‌, హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎస్‌ఎస్‌డీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సీడ్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 20

అర్హత: ఐకార్‌ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణత.

వయసు: 21-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది:  ఫిబ్రవరి 17, 2020. వెబ్‌సైట్‌:
http://www.tssdcl.telangana.gov.in/


ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌(ఐఐటీఎం) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 49

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, మేనేజర్‌.

అర్హత: పోస్టుని అసుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: ఫిబ్రవరి 10, 2020. వెబ్‌సైట్‌: https://www.iitm.ac.in/


ఎంఓఐఎల్‌, నాగ్‌పుర్‌

నాగ్‌పుర్‌లోని మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌(ఎంఓఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 22

పోస్టులు-ఖాళీలు: చీఫ్‌ మేనేజర్‌-03, సీనియర్‌ మేనేజర్‌(మెకానికల్‌)-03, సివిల్‌ ఓవర్‌సీర్‌-04, వైండింగ్‌ ఇంజిన్‌ డ్రైవర్‌-12.

అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: ఫిబ్రవరి 18, 2020. వెబ్‌సైట్‌: http://www.moil.nic.in/


నైపర్‌, కోల్‌కతా

కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైపర్‌) కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 17 పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సైంటిస్ట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌ తదితరాలు.

అర్హత:  పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 26, 2020.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: మార్చి 12, 2020.
వెబ్‌సైట్‌:
https://www.niperkolkata.edu.in/


ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌

న్యూదిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు(కెమికల్‌)

మొత్తం ఖాళీలు: 17
అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరితేది:  ఫిబ్రవరి 20, 2020.
వెబ్‌సైట్‌:
https://engineersindia.com/


ప్రవేశాలు
నాటా-2020

న్యూదిల్లీలోని ది కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(సీఓఏ) 2020-2021 విద్యాసంవత్సరానికి నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
* నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)-2020

అర్హత: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: రెండు దశల ప్రవేశపరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా.

మొదటి దశ పరీక్షతేది: ఏప్రిల్‌ 19, 2020.
రెండో దశ పరీక్షతేది: మే 31, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: మార్చి 16, 2020.

వెబ్‌సైట్‌: http://nata.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా‌ www.eenadupratibha.net చూడవచ్చు.


గమనిక: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగావకాశాలపై 30.1.2020 ‘చదువు’ పేజీలో నోటీస్‌బోర్డు కింద సమాచారం అందించాం. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వాణిజ్య  ప్రకటన దీనికి ఆధారం. అయితే ఆ ప్రకటన నకిలీదనీ, దానితో తమకు సంబంధం లేదనీ  ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. ఉద్యోగార్థులు దీన్ని గమనించగలరు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.