బ్యాటరీలోని శక్తి మరో వాహనానికి బదిలీ
close

తాజా వార్తలు

Updated : 03/02/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాటరీలోని శక్తి మరో వాహనానికి బదిలీ

విద్యుత్‌ వాహనాల కోసం కొత్త సాంకేతికత

కోటా: మీ విద్యుత్‌ వాహనంలో నిల్వ ఉన్న శక్తిని మరో వాహనానికి బదిలీ చేసే వీలుంటే..? ఆ విద్యుత్తును ఛార్జింగ్‌ స్టేషన్లలో విక్రయించుకొని డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తే..? వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఈ తరహా ‘వెహికిల్‌ టు ఎవ్రీథింగ్‌ (వీ2ఎక్స్‌)’ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారతీయ పరిశోధకులు కృషి చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లను రీఫిల్‌ చేసుకున్నంత సులువుగా ఎలక్ట్రిక్‌ వాహన యజమానులు స్టేషన్లలో బ్యాటరీలను మార్చుకోగల వెసులుబాటు కల్పించడంపైనా వారు దృష్టిపెట్టారు. తాము అభివృద్ధి చేస్తున్న ఈ రెండు సాంకేతికతలు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగదారులకు మరింత చేరువ చేసినట్లవుతుందని రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హితేశ్‌ దత్‌ మాథుర్‌ చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల మొత్తం వెలలో బ్యాటరీల ధరే 25-30 శాతంగా ఉంటోందని.. తాజా సాంకేతికతలతో అలాంటి ఖరీదైన బ్యాటరీల అవసరం తప్పుతుందని తెలిపారు.

మాల్‌లకు సరిపడా విద్యుత్తు
వీ2ఎక్స్‌ సాంకేతికతతో ఇళ్లలో తక్కువ విద్యుత్తు ఛార్జీలకే యజమానులు తమ వాహనాలను ఛార్జ్‌ చేసుకొని.. వాణిజ్యపరమైన ప్రదేశాల్లో ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. గ్రిడ్‌, హోటళ్లు, కార్యాలయాలకు కూడా శక్తిని బదిలీ చేయొచ్చు. ఇలా వాహనాల నుంచి సేకరించే విద్యుత్తుతోనే పెద్ద పెద్ద మాల్‌లను కూడా నడపొచ్చు. ఉదాహరణకు.. ఒక పెద్ద మాల్‌ ఉందనుకోండి. వీ2ఎక్స్‌ సాంకేతికతతో కూడిన కొన్ని వందల ఎలక్ట్రిక్‌ కార్లను రోజులో 6-7 గంటలకుపైగా ఆ మాల్‌కు చెందిన పార్కింగ్‌ ప్రదేశంలో ఉంచితే.. అక్కడ 5-10 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్తు కేంద్రం ఉన్నట్లే! ఒక్కో ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ సామర్థ్యం 20-25 కిలోవాట్లు ఉంటుంది. వాటి యజమానుల్లో 30-40% మంది గ్రిడ్‌కు విద్యుత్తును విక్రయించాలని నిర్ణయించుకున్నాసరే.. మాల్‌ను నడిపేందుకు సరిపడా విద్యుత్తు లభించినట్లవుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని