close

తాజా వార్తలు

Published : 03/02/2020 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూరగాయలతో హృదయం పదిలం!

వాషింగ్టన్‌: హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించేందుకు శాకాహారం ఎంతగానో దోహదపడుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో సల్ఫర్‌ అమైనో ఆమ్లాల శాతం తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిర్ధారించింది. సాధారణంగా అమైనో ఆమ్లాల కలయికతో ప్రోటీన్లు ఏర్పడతాయి. ఈ అమైనో ఆమ్లాల్లో మిథియోనైన్, క్రిస్టీన్‌ వంటి సల్ఫర్‌ అమైనో ఆమ్లాలు సహా భిన్నరకాలుంటాయి. మాంసం, పాల ఉత్పత్తులతో పోలిస్తే కూరగాయల్లో సల్ఫర్‌ అమైనో ఆమ్లాల శాతం తక్కువ. ఈ ఆమ్లాలను తక్కువగా ఆరగించేవారిలో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతున్నట్లు 11 వేల మందిపై ప్రత్యేక అధ్యయనం ద్వారా అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.