close

తాజా వార్తలు

Updated : 04/02/2020 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్లంతా  రావణుడి వారసులే : అధిర్‌ రంజన్‌

దిల్లీ: మహాత్మా గాంధీపై భాజపా ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో పెద్ద దుమారమే రేగింది. కాంగ్రెస్‌ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం ఆ పార్టీ నేత  అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని అవమానించిన వాళ్లలంతా రావణుడి బిడ్డలే’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అధిర్‌ రంజన్‌ వ్యాఖ్యలపై భాజపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బెంగళూరులో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ హెగ్డే మాట్లాడుతూ.. గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్ర్య పోరాటమంతా బ్రిటిష్‌ పాలకులతో ‘సర్దుబాటు’ ద్వారా జరిగినదేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్యపోరాటాన్ని ఆయన ఓ ‘డ్రామా’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎలా ‘ మహాత్ముడు’ అని అంటారని హెగ్డే ప్రశ్నించారు. హెగ్డే వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ఆయన తరఫున ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు హెగ్డే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భాజపా.. ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.