close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/02/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

...అది అప్పుతీర్చాల్సిందే!

ఇస్లాం సందేశం

వాగ్దానమంటే తప్పనిసరిగా నెరవేర్చే మాట. ప్రవక్త బోధనల గ్రంథంలో ‘వాగ్దాన పాలన’ అనే మకుటంతో ప్రత్యేక అధ్యాయమే ఉంది. ఇందులో వాగ్దాన, ఒడంబడికలు, ఒప్పందాలు నెరవేర్చకపోతే కలిగే పర్యవసనాల గురించిన వివరాలున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒప్పందం జరిగినప్పుడు వారు దానిని నెరవేర్చాలన్నదే దాని సారాంశం.

మాటకు కట్టుబడడం దైవానికి ఎంతో ఇష్టం. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడాన్ని ఘోరపాపంగా పరిగణిస్తారు. మాట తప్పితే పరలోక రాజ్యంలోనే కాదు ప్రాపంచిక జీవితంలోనూ అవమానాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు ప్రవక్త మహనీయులు. ‘మాట ఇచ్ఛి. తరువాత బొంకేవాడు ధర్మం లేనివాడ’ని ప్రవక్త తరచూ తన ప్రసంగాల్లో హెచ్చరించేవారు. దైనందిన జీవన వ్యవహారాల్లో మనం చేసిన ప్రతిజ్ఞలను, హామీలను తప్పనిసరిగా నెరవేర్చాల్సిందే! వాగ్దానానికి కట్టుబడటం దేవుని గుణగణాలలో ఒకటని ఖురాన్‌ స్పష్టం చేస్తోంది. స్వర్గానికి అర్హత సాధించే వారిలో వాగ్దాన పాలన చేసేవారే ముందుంటారని పవిత్ర గ్రంథం పేర్కొంది. ఇచ్చిన మాట అప్పుతో సమానం.. అది చెల్లించాల్సిందే!! అన్న ఖురాన్‌ సందేశాన్ని సదా గుర్తుంచుకుందాం.

ప్రవక్త మహనీయులు ఇచ్చిన మాటను ఎప్పుడూ జవదాటలేదు. శత్రువులు సైతం ఆయనను సాదిక్‌, అమీన్‌ అని ప్రశంసించేవారు. సాదిక్‌ అమీన్‌ అంటే సత్యసంధుడు, నిజాయతీపరుడు, ఇచ్చిన మాట తప్పనివాడు అని అర్థం. ఒకసారి ఒక వ్యక్తి ముహమ్మద్‌ ప్రవక్త (స)ను ఒకచోటికి వస్తానని చెప్పి వేచి ఉండమని చెప్పాడు. ఆ తరువాత అతడు పని ఒత్తిడిలో ప్రవక్తకు వస్తానని చెప్పిన విషయమే మర్చిపోయాడు. మూడు రోజులు గడిచిపోయాయి. ఉన్నపళంగా అతడికి ప్రవక్త విషయం గుర్తొచ్చింది. ఆ వ్యక్తి హుటాహుటిన వెళ్లి చూడగా ప్రవక్త మహనీయులు అక్కడే ఉన్నారు. తనకోసం మూడు రోజులు అక్కడే నిరీక్షింపచేసినందుకు ఆ వ్యక్తి ప్రవక్తను మన్నించమని ప్రాధేయపడ్డాడు. ‘నేను నీకిచ్చిన మాట ప్రకారం ఇక్కడ నిల్చున్నాను. నా వాగ్దానాన్ని నెరవేర్చడం నా ధర్మం’ అని చెప్పారు ప్రవక్త మహనీయులు.

- ఖైరున్నీసాబేగం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.