close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/02/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మధువొలకబోసే...

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సౌందర్య సాధనం తేనె. అందానికి మెరుగులు దిద్దే ఈ ద్రవ బంగారం వల్ల ఎన్నెన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటంటే...

పొడిబారనీయదు: అనేక కారణాలతో ముఖ చర్మం పొడిబారి పోయి నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు చెంచాడు తేనె తీసుకుని ముఖమంతా పట్టించి మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత చన్నీటితో కడుక్కోవాలి. జిడ్డు, పొడి, సాధారణ చర్మం ఉన్నవాళ్లెవరైనా ఇలా చేయొచ్చు.

శుభ్రం చేస్తుంది: వాతావరణంలోని దుమ్మూధూళి వల్ల ఒక్కోసారి ముఖం నిర్జీవంగా తయారవుతుంది. తేనెలో కొద్దిగా చక్కెర కలిపి వారానికోసారి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మృత కణాలు తొలగి చర్మం ప్రకాశమంతంగా మారుతుంది.

బిగుతుగా: చర్మ రంధ్రాలు శుభ్రపడి, బిగుతుగా మారాలన్నా, బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ తొలగిపోవాలన్నా ముఖానికి తేనె రాయొచ్ఛు తేనెలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి రాస్తే మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్ఛు

కందిపోతే: ఎండలోకి వెళ్లినప్పుడు ఒక్కోసారి ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. కొన్నిసార్లు మచ్చలూ పడతాయి. అలాంటప్పుడు చెంచాడు తేనెలో కాస్త కలబంద రసం కలిపి ముఖమంతా రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముడతలు : ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వయసు మీదపడటం... ఇలా అనేక కారణాలతో కంటి చుట్టూ ముడతలు ఏర్పడతాయి. చెంచాడు తేనెలో కొద్దిగా నీళ్లు కలిపి కంటి చుట్టూ మృదువుగా రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.