close

తాజా వార్తలు

Updated : 09/02/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. అలాంటి వారికి మనుగడే ఉండదు:యనమల

ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గపు చర్యని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు పాలనా ధర్మం కాదని.. ఒక వ్యక్తి తన వ్యక్తిగత కక్ష సాధింపునకు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలపై కక్ష సాధించే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామని.. ఉద్యోగులను బలికోరే పాలకుడికి మనుగడే ఉండదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం కేసీఆర్‌తో అక్బరుద్దీన్‌ ఓవైసీ భేటీ

 నగరంలోని పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మహంకాళి ఆలయానికి చాలినంత స్థలం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీలో 62.59శాతం పోలింగ్ నమోదు: ఈసీ

దిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఒకటికి రెండు సార్లు పరిశీలించడం వల్లే ఓటింగ్‌ శాతాన్ని ప్రకటించడానికి ఆలస్యమైందని ఈసీ పేర్కొంది. దిల్లీ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం ఓటింగ్‌ నమోదైందని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రెండు శాతం పెరిగిందన్నారు. బలిమరన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6శాతం నమోదైనట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘కరోనాను ఎదుర్కొనేందుకు చైనాకుసహకరిస్తాం’

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాసినట్లు మీడియా వర్గాల సమాచారం. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్న చైనా ప్రజలకు మోదీ సంఘీభావం తెలిపారు. ఈ విషమహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ఆయన లేఖ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాష్ట్రాలకు రూ.35వేల కోట్లు ఇవ్వనున్న కేంద్రం

జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.35 వేల కోట్లు విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల పన్ను ఆదాయం 14 శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని భరిస్తూ కేంద్రం ఐదేళ్ల పాటు ఆ నష్టం చెల్లిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాటి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం

సర్జికల్‌ మాస్క్‌లు, గ్లోవ్స్‌పై ఉన్న ఎగుమతి నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల ఎగుమతులపై గత నెలలో ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకసారి వినియోగించే పారేసే మాస్క్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా బాధితులు ఏదేశంలో ఎంతమంది?

చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దాదాపు 25 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,500 పైగా వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. అత్యధికంగా చైనాలో  దీని దాటికి 811 మంది మరణించగా.. 37,198 మంది ఇంకా దీని కోరల్లో ఉన్నారు. హాంగ్‌కాంగ్‌లో 25 కేసులు నమోదు కాగా.. ఒకరు మరణించారు. దేశాల వారీగా దీని బారిన పడిన వారి వివరాలు చూసుకుంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బంగ్లా ఆటగాళ్ల అత్యుత్సాహం

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ తుది పోరులో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి. భారత బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేస్తున్న సమయంలో దివ్యాన్ష్‌ సక్సేనా మీదకు బంగ్లా ఫాస్ట్‌ బౌలర్‌ తన్జీమ్‌ హసన్‌ బంతిని విసిరాడు. మొదట్లో వికెట్‌ పడకపోవడంతో బంగ్లా బౌలర్లు అసహనానికి గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనా నుంచి వచ్చే విదేశీయులకు నో ఎంట్రీ

 ప్రాణాంతక వైరస్‌ కరోనాతో చైనా వణుకుతోంది. ఒక్క చైనానే కాదు. ప్రపంచ దేశాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంతో జనవరి 15 తర్వాత చైనా వెళ్లి అక్కడి నుంచి వచ్చే విదేశీయులను భారత్‌లోకి అనుమతించబోమని డీజీసీఏ (డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్) ప్రకటించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భావోద్వేగానికి గురైన భాజపా అగ్రనేత అడ్వాణీ!

భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ ఇటీవల ‘శిఖర: అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌’ సినిమా చూస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘శిఖర: అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ కశ్మీరీ పండిట్స్‌’ అనే హిందీ సినిమాను ప్రముఖ దర్శకుడు విదు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. అయితే ఇటీవల ‘విదు వినోద్ చోప్రా ఫిలిమ్స్‌’ సంస్థ అధికారిక ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.