close

తాజా వార్తలు

Published : 13/02/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రానా ‘అరణ్య’ టీజర్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు రానా కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రానా విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. బుధవారం సాయంత్రం హిందీ, కన్నడ వెర్షన్ల టీజర్లను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా గురువారం తెలుగు టీజర్‌ను విడుదల చేసింది. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.