close

తాజా వార్తలు

Updated : 15/02/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

...అలా ఉండొద్దని చెప్పండి!

పిల్లలు - పెంపకం

సన క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టే. కానీ ఏం ప్రయోజనం. మహా సున్నితం. చిన్న వాటికే కుంగిపోతుంది. ఒకసారి మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది..


రీతూకి కోపం వచ్చిందంటే ఇంట్లో ఏదో ఒక వస్తువు విరగాల్సిందే. తనకు నచ్చనిది ఏది చేసినా ఇలాగే ప్రవర్తిస్తుందామె..

లాంటి అమ్మాయిలు మన చుట్టూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే.. చిన్న కష్టం వచ్చినా కుంగిపోతారు. అయినదానికీ, కానిదానికీ అతిగా స్పందిస్తారు. ఇంకొందరికి స్పందించే తత్వమే ఉండదు. ఇవన్నీ ఉద్వేగాలు. అసలు పిల్లలు ఇలా మారడానికి గల కారణాలని ముందుగా తెలుసుకుందాం.

కారణాలేంటీ...

కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులూ రావొద్దని వారే అన్నీ సిద్ధం చేసిపెడతారు. వాళ్లు కూడా సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయరు. దాంతో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందిపడుతుంటారు.

‘నువ్వు డాక్టరవ్వాల్సిందే... రేయింబవళ్లు చదవాల్సిందేన’ని ఎటూ కదలనివ్వకుండా కూర్చొబెట్టి చదివించే అమ్మానాన్నలు చాలామందే ఉంటారు. ప్రశాంతంగా ఊపిరి పీల్చేందుకూ వారికి సమయం ఇవ్వరు. ఇలా పిల్లలకు వ్యక్తిగత సమయం లేనప్పుడు వారి ఉద్వేగాలు వ్యక్తపరచలేరు. ఒక వస్తువు బాగుందని కూడా చెప్పలేరు.

మరికొందరు పిల్లలకు ఫోనే ప్రపంచం. నిద్ర లేచింది మొదలు, పడుకునే వరకు ఫోన్‌ లేకుండా వాళ్లు ఉండలేరు. ఇతరులతో మాట్లాడరు. చిన్నచిన్నవాటికే అసహనానికి గురవుతారు. తల్లిదండ్రులు కూడా వారితో మాట్లాడటానికి సమయం వెచ్చించరు.

ఒకప్పుడు పిల్లలందరూ మైదానంలోకి వెళ్లి ఆడుకునేవారు. ఇప్పుడు చదువు, ర్యాంకుల ధ్యాసలో శారీరక శ్రమ లోపిస్తోంది. ఇవన్నీ పిల్లల్లో ఇటువంటి ప్రతికూల భావనల్ని పెంచుతున్నాయి.

ఇలా చేయండి...

బయట జరిగే గొడవలకి మన పిల్లలు దూరంగా ఉండాలని ఆలోచిస్తాం. దాంతో అటువంటి ప్రపంచం ఒకటి ఉంటుందని తెలియకుండా జాగ్రత్తపడతాం. పిల్లవాడి చుట్టూ ఓ గోడకట్టే ప్రయత్నం చేస్తాం. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే కదా వాస్తవ ప్రపంచం అంటే ఏంటో తెలిసేది. ఒక వ్యక్తి ఎందుకు కోప్పడుతున్నాడు? ఆ కోపానికి అవతలి వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు వంటివన్నీ పరిశీలించే అవకాశం దొరుకుతుంది. ఇదే జరిగేతే... భిన్న ఉద్వేగాల్ని వారు గుర్తించగలుగుతారు. దానివల్ల జరిగిన లాభాలు, నష్టాల్ని బేరీజు వేసుకోగలుగుతారు.

భోజనం సమయంలోనో... తీరిక వేళల్లోనో కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోవడానికి సమయం పెట్టుకోవాలి. ఇలాంటప్పుడే కుటుంబ సభ్యుల ఆలోచనలు, అనుభూతులు పిల్లలకు తెలుస్తాయి. ‘మనం’ అనే భావన, సహానుభూతి వారిలో పెరుగుతుంది. ఇతరుల ఆలోచనలేంటీ... వారి పట్ల ఎంతవరకు ప్రేమ, కోపం వంటి ఉద్వేగాలు చూపించాలో వారు నేర్చుకుంటారు. ●


‘పక్కింటి రాముకి పదిలో పదికి పది పాయింట్లు వచ్చాయి. నువ్వేమో ఎనిమిది పాయింట్లతోనే సరిపెట్టుకున్నావు... వాడికి మంచి ఉద్యోగం వస్తుంది... నువ్వేమో ఇలాగే మిగిలిపోతావ్‌...’ ఇలాంటి పోలికలు తీసుకురావడం మనిళ్లల్లో ఎప్పుడూ ఉండేవే. పిల్లల్లో లోపాలని వెతకడానికి బదులు వారి బలాలేంటో పిల్లలకు తెలియజేయండి. సాధనతో బలహీనతల నుంచి ఎలా బయటపడాలో చెప్పండి. ఇది వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సానుకూల ఉద్వేగాలు పెరుగుతాయి. అప్పుడు ఎవరైనా ఒకమాట అన్నా కుంగిపోరు. ●


చదువు... చదువని వెంటపడుతూ పిల్లలని కనీసం మైదానానికి కూడా పంపించని తల్లిదండ్రులు చాలామందే. స్నేహితులతో కలిసి ఆడుకుంటే... సంతోషానికి కారణమయ్యే హార్మోన్లు విడుదలవుతాయి. చిన్నవాటికే కుంగిపోవడం, కోపం, అసహనంతో అరవడం వంటివి దరిచేరవు.●


పిల్లలు ఏదైనా విసిరేసినా, విరగొట్టినా వారిని వారు ప్రశ్నించుకునేలా చేయండి. క్షణం కోపం వల్ల ఏం జరిగింది. ఏమైనా లాభం వచ్చిందా... ఇలా వారినివారు ప్రశ్నించుకునేలా చేయండి. మరోసారి అలా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.