‘హార్ట్‌’ఫుల్‌గా ఉండండి
close

తాజా వార్తలు

Published : 15/02/2020 01:05 IST

‘హార్ట్‌’ఫుల్‌గా ఉండండి

ఫిట్‌నెస్‌

రకలేసే వయసులో వర్కవుట్స్‌ చేయాల్సిందే. మీరు చేస్తున్నారా? లేదంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. వర్కవుట్స్‌తో పాటు తీసుకునే డైట్‌.. రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయాల్సిందేనని సూచిస్తున్నారు.

* కాస్త కారం తగిలించాలి. ‘చిల్లీ పెప్పర్‌’తో గుండెకి సంబంధించిన పలు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చట.

* రోజులో కుదిరితే మూడు లేదా రెండు సార్లు బ్రష్‌ చేయడం మంచిది. ఇలా చేస్తే హార్ట్‌ ఫెయిల్యూర్‌ రిస్క్‌ని తగ్గించొచ్చట.

* షుగర్‌ ఫ్రీ కూల్‌ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. ఇవి రోజులో రెండు కంటే ఎక్కువ తాగితే గుండెకి హాని కలుగుతుందట.

* గంటలు గంటలు టీవీ చూడడం మానుకోవాలి. రోజులో నాలుగు గంటలు చూస్తే కచ్చితంగా గుండెకు ప్రమాదమే!

* తాజాగా కట్‌ చేసిన అల్లం ముక్కల్ని చప్పరించండి.

* పెంపుడు జంతువులతో గడపడం ద్వారా కూడా గుండెకి ఎంతో మేలు చేకూరుతుందట.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని