close

తాజా వార్తలు

Published : 15/02/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. మందడంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను.  జగన్‌ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు’’ అని పవన్‌ అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్‌కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రి తలసానికి జరిమానా

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ  అధికారులు షాక్‌ ఇచ్చారు. అనుమతి లేకుండా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు. ఈ మేరకు రూ.5వేలు జరిమానా కట్టాలంటూ శనివారం నోటీసులు జారీచేశారు.  అధికారుల నోటీసులకు స్పందించిన మంత్రి  తనకు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బొత్స అందుకే అలా మాట్లాడారేమో!: టీజీ 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఎంపీ, భాజపా నేత టీజీ వెంకటేశ్‌ అన్నారు. భాజపా, వైకాపా కలయికను పైస్థాయిలో నిర్ణయిస్తారన్నారు. వైకాపా అధినేత, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి సంకేతాలు వచ్చాయి గనకే బొత్స అలా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో భాజపా వల్లే వైకాపాకు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ వినతిపత్రంలో ఏముందో జగన్‌ చెప్పాలి?

 దిల్లీ పర్యటనలో ఏం మాట్లాడారో కూడా చెప్పలేనిస్థితిలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ, అమిత్‌ షాతో ఏం మాట్లాడారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఈ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. దిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రంలో ఏముందో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే మంత్రులతో ప్రకటన చేయిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడంలేదు

 ఎన్డీయేలో వైకాపా చేరే అంశంపై తమకెలాంటి సమాచారం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా, వైకాపాలకు సమదూరం పాటించాలనేదే తమ పార్టీ నిర్ణయమని స్పష్టంచేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే మోదీ, అమిత్‌ షాలతో జగన్‌ భేటీ అయి ఉంటారన్నారు. బొత్స ఎందుకు అలా మాట్లాడారో తెలియడం లేదని చెప్పారు. ఈ అంశం గురించి గతంలో కూడా ఎప్పుడూ చర్చ జరిగిన సందర్భంలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గాంధీ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంవ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. వసంత్‌ వైద్యుడిగా ఉండి ఆత్మహత్యకు యత్నించడం సరికాదన్నారు. గాంధీలో పరిణామాలపై ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘చిట్టితల్లీ.. నిన్ను మళ్లీ చూశానమ్మా’

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ ఏడేళ్లకే దూరమైతే ఆ తల్లి పడే కడుపుకోత వర్ణనాతీతం. అలాంటిది చనిపోయిన కూతుర్ని మళ్లీ కలుసుకునే అవకాశం వస్తే.. ఆ కన్నపేగు ఉప్పొంగిపోతుంది. ఆ అనుభూతినే ఓ తల్లికి అందించింది దక్షిణ కొరియాకు చెందిన టీవీ ఛానల్‌. మన జీవితంలో నుంచి శాశ్వతంగా దూరమైన వ్యక్తులను మళ్లీ కలుసుకునే అవకాశం నిజ జీవితంలో సాధ్యం కాకపోయినప్పటికీ వర్చువల్‌ రియాల్టీతో ఓ తల్లి తన చనిపోయిన కుమార్తెను కలిసేలా చేసింది ఆ టీవీ ఛానల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాన్‌-ఆధార్‌ లింక్‌ మార్చి 31 డెడ్‌లైన్‌ 

 మీ పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించలేదా..?అయితే 31 మార్చి 2020నుంచి ఇక మీ పాన్‌కార్డు పనిచేయనట్లే. ఎందుకంటే మార్చి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులను పని చేయనివిగా పరిగణిస్తామని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే దీని గడువును చాలా సార్లు పొడగించామని..ఈ మార్చి వరకు లింక్‌ చేయని కార్డులని పనిచేయనివిగా గుర్తిస్తామని పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రేపే తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.