close

తాజా వార్తలు

Published : 16/02/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోరి కోరి కూరుకుపోవద్దు!

ఇవి గమనించండి..

హేమ చాలారోజులు ఒంటరితనంతో ఇబ్బంది పడింది. దాన్నుంచి బయటపడటానికి కవిత్వం రాసేది. వాటిని ఫేస్‌బుక్‌లో చూసిన చాలామంది ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించారు. వారిలో ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని ఆమెకు రోజూ సందేశాలు పంపేవాడు. చివరికి  కవిత్వంతోనే హేమను ఆకట్టుకున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరు ప్రేమ వ్యవహారం కొనసాగించారు. కొన్నాళ్ల తరువాత హేమపై అనుమానం పెంచుకున్నాడు ఆ వ్యక్తి. క్రమంగా ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి.ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటోలను ఫలానా వ్యక్తి ఎందుకు ఎక్కువ సార్లు లైక్‌ చేశాడని వేధించేవాడు. చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించిందామె..
ఒంటరితనం, అనారోగ్యం, ఇంటి సమస్యలు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యులపై వ్యతిరేకత.. వంటి సమస్యలన్నీ సామాజిక మాధ్యమాల్లో పంచుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివారు ఇతరుల నుంచి సాంత్వన, ఓదార్పు, ప్రేమ కోరుకుంటారు. ఈ క్రమంలో సులువుగా ఆకతాయిల బారిన పడతారు. వారు చెప్పే ఓదార్పు మాటలకు కరిగిపోతారు. అనుబంధాలు, భావోద్వేగాల నుంచి బయటపడలేనంతంగా వారికి దగ్గరవుతారు. వీరిలో వివాహితులు కూడా ఉండొచ్చు. ఈ బంధాలు చివరికి నేరాలకు దారితీసే అవకాశం ఉంది.
చాలామంది మహిళలు తమది సున్నిత మనస్తత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా కాకుండా వాస్తవిక ధోరణితో ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలతో ఎక్కువ సమయం వృథా చేస్తున్నామనిపిస్తే.. ఇతర విషయాలవైపు దృష్టి మళ్లించాలి. అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ఆకతాయిల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలి.


భర్త, ఇతర కుటుంబ సభ్యులతో ఉండే మనస్పర్థలను దృష్టిలో పెట్టుకుని, వారికి వ్యతిరేకంగా పోస్టులు, స్టేటస్‌లు పెట్టకూడదు. గొడవలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలి. అంతేకాని దురుద్దేశంతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. తాత్కాలిక ఆనందం, ఇతరుల ఓదార్పు కోసం తాపత్రయపడొద్దు.

 

సుజాత వేల్పూరి, కౌన్సీలర్ 


అత్యవసరమైతేనే వీడియో కాల్స్‌ మాట్లాడాలి. ఇప్పుడు వస్తున్న ఫోన్లలో స్క్రీన్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌తో వీడియో కాల్స్‌నూ రికార్డు చేయొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీడియో కాల్‌లో అసభ్యకరంగా ప్రవర్తించడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం.. వంటి వాటికి పూర్తి దూరంగా ఉండాలి.
నగలు, డబ్బు, ఇతర ఆర్థిక వివరాలు, ఆస్తిపాస్తులకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం మానుకోవాలి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలూ పంచుకోకూడదు.


మానసికంగా, భావోద్వేగాల పరంగా ఇతరులపై ఆధారపడే గుణాన్ని తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్యలను సోషల్‌ మీడియాలో పెట్టి సానుభూతి సంపాదించాలనే ఉద్దేశం కొంతమందికి ఉండొచ్చు. కానీ అది సానుభూతి నుంచి ఓదార్పు, సాంత్వన, స్నేహం.. ఇలా మరింత దూరం వెళ్లే అవకాశం ఉందని గ్రహించాలి.


సోషల్‌ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిగత ఫొటోలు, అసభ్యకరమైన పోస్ట్‌లు షేర్‌ చేయకపోవడం మంచిది. మీరు మాధ్యమాల్లో పంచుకునే ఫొటోలకు వచ్చే లైకులు తాత్కాలికంగా ఆనందం కలిగించొచ్చు. కానీ అవి దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ.


మాధ్యమాల్లో.. ఒక వ్యక్తి దురుద్దేశంతో మీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా స్నేహంతో, చనువుతో సన్నిహితంగా మాట్లాడుతున్నాడా అనేది బేరీజు వేసుకోవాలి. అనుమానం వస్తే దూరంగా ఉంచాలి. ఒకవేళ ఆ వ్యక్తిపై మీకు ఇష్టం ఉంటే... అతడి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఏకాంత ప్రదేశాల్లో ఇలాంటి వారిని కలవడం మంచిదికాదు.


సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్‌ చేసేవారు.. స్నేహితులతో సాధారణ విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు పంచుకోకూడదు. సన్నిహితంగా చేసిన ఛాటింగ్‌ స్క్రీన్‌షాట్లను బహిరంగపరిచి, మహిళలను అవమానించడం కష్టమైన పని కాదు. అందుకే.. ఛాటింగ్‌లో అవతలి వ్యక్తి హద్దు మీరుతున్నాడని అనుమానం వచ్చిన మరుక్షణమే ఆ ఖాతాను బ్లాక్‌ చేయాలి.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.