close

తాజా వార్తలు

Updated : 16/02/2020 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. మేం అలా అనలేదు..:బొత్స

తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2వేల కోట్ల నగదు దొరికిందని తాము అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, అక్రమాలకు సంబంధించిన పత్రాలు దొరికాయని చెప్పామన్నారు. ఇదే విషయాన్ని ఐటీ అధికారులు చెప్పారని.. ఈ మేరకు ఆ పత్రాలను సీజ్‌ చేశారన్నారు.  తెదేపా నేతలు పరువునష్టం దావా వేస్తామంటే భయపడే వారెవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ ఆశ్రమంపై విజయసాయిరెడ్డి కన్ను:దేవినేని

టీవల ఐటీ దాడులు జరిగిన 3 ఇన్‌ఫ్రా కంపెనీల గురించి మంత్రి బొత్సతో పాటు ఇతర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్‌ అయిన సీఎం జగన్‌ ముందు బొత్స చేతులు కట్టుకుని అవమానంతో ఉండే కంటే ధైర్యంగా నిజాలు మాట్లాడాలని వ్యాఖ్యానించారు.  విశాఖలోని వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని దేవినేని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మత ఘర్షణల ఘనత మజ్లిస్‌దే: కిషన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. అధికార తెరాస అండదండలతోనే ఎంఐఎం పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు. మత ఘర్షణలు సృష్టించిన ఘనత మజ్లిస్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. గల్లీలకు పరిమితమైన మజ్లిస్‌ పార్టీ అల్లర్లను భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అన్నిరాష్ట్రాలతో సామరస్యమే మా విధానం:నిర్మల

పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గింపు నిర్ణయం పూర్తిగా తమది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని.. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటా అధికంగానే ఉందని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా ఉండటమే ఎన్డీయే ప్రభుత్వ విధానమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశ ప్రయోజనాలకే కఠిన నిర్ణయాలు: మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మోదీ దాదాపు రూ.1254కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టనున్న 50 ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆ విషయంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘సామజవరగమన’ ఫుల్‌ వీడియో వచ్చేసిందోచ్‌..!

 సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సామజవరగమన’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది. ‘సామజవరగమన’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోన్న నేపథ్యంలో తాజాగా ఆ పాటకు సంబంధించిన సాంగ్‌ ఫుల్‌ వీడియోను ఆదివారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. పారిస్‌లో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్‌లో బన్నీ స్టైల్‌.. పూజా హెగ్డే అందం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పొత్తుల్లేవ్‌.. ఒంటరిగానే గెలుద్దాం: నడ్డా

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కొందరి స్వార్థం వల్లే అధికారానికి దూరమయ్యామని, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఒంటరి పోరుకు సిద్ధమవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకపై మహారాష్ట్రలో జరగబోయే భవిష్యత్‌ ఎన్నికలన్నింట్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌.. మొబైల్స్‌పై డిస్కౌంట్స్‌

 ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్‌ బొనాంజా’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. మరికొన్ని మొబైల్స్‌ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు అందనున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో లభించబోయే డిస్కౌంట్లపై ఓ లుక్కేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. షాను కలుస్తాం.. షహీన్‌బాగ్‌ నిరసనకారులు

 పోలీసుల నుంచి అనుమతి లభించాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామని షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. ఆదివారం షా నివాసానికి వెళ్లేందుకు ర్యాలీగా బయల్దేరగా.. అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తమ నిరసన శిబిరానికి వెనుదిరిగారు. నిరసనకారుల మార్చ్‌ ఉండడంతో అప్పటికే మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడేందుకు ఆర్సీబీ పేసర్‌ సిద్ధం

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఆటగాడు, దక్షిణాఫ్రికా పేస్ దళపతి డేల్‌ స్టెయిన్‌ అన్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. పీఎస్‌ఎల్లో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తరఫున స్టెయిన్‌ ఆడనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.