close

తాజా వార్తలు

Published : 21/02/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం తాగించి భర్తను చంపేసింది!

సంగారెడ్డి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కడతేర్చింది ఓ భార్య. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని బీరప్ప బస్తీలో  చోటుచేసుకుంది. వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు బీరప్ప బస్తీలో నివాసం ఉంటున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తను చంపాలనుకుంది భార్య వెంకటమ్మ. ఈ క్రమంలో మరో మహిళ సాయంతో పథకం ప్రకారం భర్తకు మద్యం తాగించి హత్య చేసింది. అనంతరం అమీన్‌పూర్‌ లాల్‌బాయ్‌ కాలనీ వద్ద మృతదేహాన్ని పడేసింది. భర్త వెంకటయ్యను భార్య వెంకటమ్మే హత్యచేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.