భారత్‌లో యాపిల్ విక్రయశాల 2021లోనే: టిమ్‌
close

తాజా వార్తలు

Published : 28/02/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో యాపిల్ విక్రయశాల 2021లోనే: టిమ్‌

కాలిఫోర్నియా: సాంకేతిక దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తన మొదటి విక్రయశాలను 2021లో ఏర్పాటు చేస్తామని తాజాగా వెల్లడించింది. అయితే ఈ సంవత్సరం నుంచి మాత్రం ఆన్‌లైన్‌లో అమ్మకాలను మొదలు పెడతామని తెలియజేసింది. తమ అధికారిక ఈ-స్టోర్‌ ద్వారా తమ ఉత్పత్తును నేరుగా వినియోగదారులకు విక్రయిస్తామని కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ భాగస్వామ్యపక్షాల వార్షిక భేటీలో యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ ప్రకటించారు. భారత్‌లో భాగస్వామి ద్వారా కాకుండా తామే సొంతంగా విక్రయశాల ప్రారంభించడానికి భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వేరే వారి చేతుల్లో మా ఉత్పత్తులను పెట్టాలని కోరుకోవడం లేదని కుక్‌ అభిప్రాయపడ్డారు.  

ఇప్పటివరకు దేశంలో నేరుగా కాకుండా అమెజాన్‌, క్రోమా వంటి థర్డ్‌ పార్టీ మాధ్యమాల ద్వారా యాపిల్‌ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. భారత్‌లో తమ సొంతంగా విక్రయాలను ప్రారంభించేందుకు యాపిల్‌ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, గతంలో ఉన్న నిబంధనల కారణంగా యాపిల్ భారత్‌లో సొంతంగా విక్రయించలేకపోయింది. భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులతో యాపిల్‌ నేరుగా విక్రయించాలనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొదటి విక్రయశాలను ముంబయిలో ప్రారంభించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, సంస్థ మాత్రం అధికారింగా ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది వెల్లడించలేదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని