close

తాజా వార్తలు

Updated : 28/02/2020 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశాల్లో ఉన్నా.. స్వదేశంపై మమకారంతో..

దేశ సంస్కృతి వైభవాన్ని విదేశాల్లో చాటుతున్న వరంగల్‌ మహిళ

వరంగల్‌: విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత అక్కడి గొప్పలను స్వదేశంలో చెప్పి మురిసిపోయే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, స్వదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్న వారి గురించి వినుండరు.  అలాంటివారు చాలా తక్కువమందే ఉంటారు.  ఆ కోవకు చెందిన వారే వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన హేమ ఎల్లాప్రగడ. దశాబ్దాల క్రితమే లండన్‌లో స్థిరపడ్డారు. అన్నీ ఉన్నా... దేశ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు తెలియజెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో చరిత్ర, భారతీయ నిర్మాణ శైలిపై వీడియోలుగా రూపొందించి పిల్లలకు అందిస్తున్నారు.  
 
చరిత్ర అంటే విసుగనిపిస్తుందని చాలామంది పిల్లలు అంటుంటారు. అలాంటి వారికి చరిత్రను ఓ పాఠంలా కాకుండా బొమ్మల ద్వారా కథలుగా చెబితే ఆసక్తి కలుగుతుంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు హేమ. బ్రిటన్‌లో స్థిరపడిన రెండో తరం పిల్లలు మన సంప్రదాయాలకు క్రమంగా దూరమవుతున్నారని భావించి ‘ఉటో’ సంస్థను స్థాపించారు. కాకతీయ కట్టడాల నిర్మాణ శైలి, విజయనగర రాజుల పరాక్రమం ఇలా అనేక సామ్రాజ్యాల వైభవాలను, అలనాటి నిర్మాణాల రహస్యాలను యూట్యూబ్‌ వీడియోలుగా రూపొందించి పిల్లల కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. స్వదేశానికి వచ్చిన ప్రతీసారి ఏదో ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిసరాలను అధ్యయనం చేసి వీడియోలు రూపొందిస్తున్నారు. 

దేశంలో తెలుగు భాష గొప్పతనాన్ని చాటే విధంగా హేమ అక్కడి పిల్లలకు శ్లోకాలు, పద్యాలను నేర్పిస్తున్నారు. రామాయణ, మహాభారత విశిష్ఠతలను తెలియజేస్తూ.. పండగ రోజుల్లో అక్కడి పిల్లలకు వాటి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ‘ఉటో’ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మన దేశానికి చెందిన గణిత మేధావుల చరిత్రపై వీడియోలు చేసే పనిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. చరిత్ర విద్యార్థిగా తనకున్న అనుభవాన్ని సైతం జోడించి అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి విశ్లేషణలు చేస్తున్నారు. మరో ముందగుడు వేసి ప్రాచీన విశ్వవిద్యాలయాల గొప్పతనంపై వీడియోలు రూపొందిస్తున్నారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.