close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/03/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మమ్మ దగ్గరేఉంటానంటున్నాడు!

మా బాబుకు రెండేళ్లు. రెండో సారి గర్భం దాల్చాను. నాకిప్పుడు ఆరో నెల. నాకు మూడో నెల వచ్చినప్పట్నుంచే బాబుకు పాలు ఇవ్వడం ఆపేశా. అప్పటి నుంచి వాడి బాగోగులను అమ్మకు అప్పజెప్ఫా సమస్య ఏమిటంటే... బాబు నా దగ్గరకు రానంటున్నాడు. అమ్మమ్మే కావాలంటున్నాడు. మా అమ్మ వాడిని బాగా గారం చేస్తోంది. అడిగింది ఇవ్వాల్సిందే. లేదంటే ఏడ్చి సాధించుకుంటాడు. కావాల్సింది దొరకనప్పుడు అందరినీ కొడతాడు. తన ప్రవర్తన ఇలానే ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? వాడిని మార్చేదెలా?

- ఓ సోదరి

ల్లి సంరక్షణలో చిన్నారులు అభద్రత లేకుండా పెరుగుతారు. పిల్లలు కూడా... ఒకటిన్నర- రెండేళ్ల సమయంలో వారు తల్లిదండ్రులతో ఎక్కువగా గడపాలనుకుంటారు. మీ విషయంలో... బాబును రెండేళ్ల వయసులో మీ అమ్మ దగ్గర వదిలేశానని చెబుతున్నారు. మీ దగ్గర సంతోషంగా పెరిగిన అబ్బాయి ఒక్కసారిగా దూరంగా వెళ్లాడు. దాంతో మానసికంగా కుంగిపోయాడు. సహజంగా చిన్నారులు తమ కోసం ఎవరు సమయం కేటాయిస్తారో... వారినే ఎక్కువగా ఇష్టపడతారు. వారికే చేరువవుతారు. అమ్మమ్మ అడిగిందల్లా చేస్తుంటే... మీరు మాత్రం కాదని అనేసరికి మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాకుండా ఎదుటివారి దృష్టి తనవైపు మరల్చుకోవడానికి చూస్తున్నాడు. ‘ఏడిస్తే.. ... నేను అనుకున్నది సాధిస్తా’ అని బాబు నమ్మకం.

మీరేం చేయాలంటే...

ఇప్పుడు బాబు ప్రవర్తనను నియంత్రించకపోతే పెద్దయిన తరువాత కొన్నిరకాల మానసిక సమస్యలు తప్పవు. ఇందులో భాగంగా అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, చెప్పిన మాట వినకపోవడం, తోబుట్టువులను కొట్టడం, స్కూలుకు వెళ్లనని మొండికేయడం... లాంటివి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... ముందుగా బాబును మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. వారు తన మానసిక ఎదుగుదల సరిగా ఉందో లేదా పరిశీలిస్తారు. ఏం చేస్తే తన ప్రవర్తనలో మార్పు వస్తుందో తెలుసుకుంటారు. తను మొండిచేసే విధానాన్ని ఆపడానికి.. అతడి దృష్టి మరల్చాలి లేదా ఆ సమయంలో కాస్త కఠినంగా ఉండాలి. మీతోపాటు తక్కిన కుటుంబ సభ్యులు అంతా ఒకేలా ఉండాలి. తన ప్రవర్తన బాగున్నప్పుడే అడిగినవి సమకూర్చాలి. ఏడ్చినప్పుడు, మొండికేసినప్పుడు అస్సలు ఇవ్వకూడదు. మీరు కూడా తనను దగ్గర కూర్చొబెట్టుకుని కథలు చెప్పాలి. బయటకు తీసుకువెళ్లి మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేలా చూడాలి. దీనివల్ల చిన్నతనం నుంచే సర్దుకుపోవడం, అందరితో కలిసిపోవడం లాంటి లక్షణాలు అలవడతాయి. మీ అమ్మకు, మీకూ కౌన్సెలింగ్‌ అవసరమవ్వొచ్ఛు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.