అంత విరామం వద్దు!
close

తాజా వార్తలు

Published : 02/03/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంత విరామం వద్దు!

అందరి బాగోగులు చూసే మనం... మన గురించి పట్టించుకోం. అందరూ తినడం అయిపోయిన తర్వాత తీరిగ్గా ఎప్పటికో తింటాం. అది కూడా ఆదరాబాదరాగా నాలుగుమెతుకులతో భోజనం అయ్యిందనిపిస్తాం. ఫలితం ఎసిడిటీ. ఈ సమస్య రాకుండా ఉండాలంటే... జీవనశైలిపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి..

హారం తీసుకోకుండా ఎక్కువ సేపు పొట్టను ఖాళీగా ఉంచకూడదు. ఏమీ తినకుండా నాలుగ్గంటలకంటే ఎక్కువ సేపు ఉండకూడదు. ఇలా చాలాసేపు పొట్టను ఖాళీగా ఉంచడం వల్ల ఆమ్లాలు ఎక్కువగా విడుదలై కడుపు, గొంతులో మంటపుడుతుంది. అందుకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య ఎక్కువ విరామం లేకుండా చూసుకోవాలి.

మెల్లగా తినాలి...

ఆహారాన్ని మెల్లగా నమిలి మింగాలి. పెద్దపెద్ద ముద్దలను గబగబా తినడం వల్ల వాటిని జీర్ణం చేయడానికి పొట్ట ఎక్కువ ఆమ్లాలను విడుదల చేయాల్సి ఉంటుంది. అధికంగా విడుదలైన ఈ ఆమ్లాలు తిన్న ఆహారంలోని పోషకాలను నాశనం చేస్తాయి.

ఎలాంటి ఆహారం

పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, ఎండు ఫలాలు.. లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వాటిని జీర్ణం చేయడానికి శరీరం తగిన పరిమాణంలో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. జంక్‌ఫుడ్‌, బాగా శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోవడం, పంచదార, ఉప్పును ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటిని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ మొత్తంలో ఆమ్లాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

మందుల వాడకం..

ప్రతి చిన్న సమస్యకూ మందుల వాడకాన్ని తగ్గించాలి. యాంటీ బయోటిక్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను తగ్గించి ఆమ్లత్వాన్ని పెంచేస్తాయి.

మంచినీళ్లు

చాలామంది అవసరాని కంటే తక్కువ నీటిని తాగుతుంటారు. కావాల్సిన దాని కంటే ఒక్క శాతం నీరు తగ్గినా అలసట, ఎసిడిటీతోపాటు అనేక సమస్యలూ తలెత్తుతాయి. ఆహారంతోపాటుగా తగినన్ని మంచినీళ్లూ తీసుకోవాలి.

యోగా

ప్రాణయామం, కొన్ని శ్వాస సంబంధ వ్యాయామాలు ఎసిడిటీ సమస్యను నియంత్రిస్తాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని