close

తాజా వార్తలు

Updated : 02/03/2020 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. హైదరాబాద్‌లో కరోనా: ప్రభుత్వం సూచనలు

రాష్ట్రంలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించింది. ప్రజలంతా వాటిని పాటించి వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కరపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు:లోకేశ్‌

అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. మందడంలో డ్రోన్‌ కెమెరాతో పోలీసులు చిత్రీకరించారనే ఆందోళనలో అరెస్టయి గుంటూరు జైల్లో ఉన్న రైతులను ఆయన పరామర్శించారు. రైతుల పక్షమని కాలర్‌ ఎగరేసే వైకాపా ప్రభుత్వం.. 2,500 మంది అమరావతి రైతులపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?:కన్నా

గుంటూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సీఏఏపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరిగిన తర్వాతే చట్టం చేశారని గుర్తుచేశారు. ఓ వర్గానికి నష్టం జరుగుతుందంటూ ఎంఐఎం, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. తద్వారా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంకెప్పుడు ఉరి తీస్తారు: నిర్భయ తల్లి

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి ఘాటుగా స్పందించారు. ఉరిశిక్ష అమలు ప్రక్రియ పదేపదే వాయిదా వేయడం.. మన వ్యవస్థ వైఫల్యాన్ని చూపిస్తోందని అన్నారు. నిర్భయ దోషులకు రేపు విధించాల్సిన ఉరిశిక్షపై పటియాలా హౌస్‌ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ పాన్‌కార్డు వాడితే 10వేలు జరిమానా..!

 

ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది. గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై ఆదాయపుపన్ను చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఈటల

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలిందని, అది ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రిజర్వేషన్లను తెదేపాయే అడ్డుకుంది: బొత్స

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీన్ని తెదేపా అడ్డుకుందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దుర్గంచెరువు వంతెన పరిశీలించిన కేటీఆర్‌

 నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను పరిశీలించి పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్మిస్తున్న ఫైఓవర్‌, దుర్గం చెరువు వంతెన పనులను పరిశీలించి కాంట్రాక్టు ఏజెన్సీలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన సుందరీకరణ పనులను ఇప్పటి నుంచే ప్రారంభించాలని మంత్రి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశంలో మరో కరోనా కేసు నమోదు!

ఇటలీ నుంచి జైపూర్‌కు వచ్చిన ప్రయాణికుడికి సోమవారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతడి రక్త నమూనాలను మరోసారి పరీక్షించేందుకు పుణెలోని ఎన్‌ఐవీకి పంపినట్లు తెలిపారు. రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి జైపూర్‌ వచ్చిన ప్రయాణికుడిని స్క్రీనింగ్ నిర్వహించగా కరోనా లక్షణాలున్నట్లు తేలింది.’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాధిక హత్య కేసులో తండ్రే నిందితుడు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీ వీడింది. సంఘటన జరిగిన 21 రోజులకు పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. ఆమె తండ్రే హత్య చేసినట్లు నిర్ధరించారు. కరీంనగర్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ముత్త రాధిక ఫిబ్రవరి 10న ఇంట్లో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె ఖర్చులు భరించలేక ఆమె తండ్రే దిండుతో నొక్కి చంపి గొంతు కోసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.