ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయవచ్చు:ట్విటర్‌
close

తాజా వార్తలు

Published : 04/03/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయవచ్చు:ట్విటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం(ఇంటి నుంచే పని) అవకాశం కల్పించింది. కోవిడ్‌19(కరోనా) వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ట్విటర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్‌ ఉద్యోగులను కలిగి ఉంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలన్న లక్ష్యంతో తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్‌ మానవ వనరుల ముఖ్య అధికారి జెన్నిఫర్‌ క్రిస్టీ చెప్పారు. ఇప్పటికే దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్‌, జపాన్‌ తదితర దేశాల్లో ఈ నిబంధన తప్పనిసరి చేశామన్నారు. 
మధ్య చైనాలో బయటపడిన ఈ వైరస్‌ ఒక్క చైనాలోనే ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా మందిని బలి తీసుకుంది. 90వేలకు పైగా ప్రజలు ఈ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. దక్షిణ కొరియాలో దాదాపు 5వేలకు పైగా కోవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 28 మంది మృతి చెందారు. జపాన్‌లోనూ ఆ దేశ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులివ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఇంటి నుంచి పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేసేందుకు యోచిస్తోంది. హాంగ్‌కాంగ్‌లో నెల రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోం అనుమతి ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఆ దేశ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా.. ట్విటర్‌ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని