close

తాజా వార్తలు

Updated : 06/03/2020 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ రేపే

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ రేపు వెనువెంటనే విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా విజయవాడలోని ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైకాపా నుంచి ఎమ్మెల్యేలు జోగి రమేశ్‌, అనిల్‌ కుమార్‌, తెదేపా నుంచి వర్ల రామయ్య, ఆలపాటి రాజాతో పాటు పోతిన వెంకట మహేశ్ (జనసేన), వైవీ రావు (సీపీఎం), జెల్లి విల్సన్‌ (సీపీఐ) నాగభూషణం (భాజపా) హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఈనాడు’కు విశిష్ట పురస్కారం

తెలుగువారి గుండెచప్పుడు ‘ఈనాడు’కు విశిష్ట గౌరవం దక్కింది. పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) ఇచ్చే చాణక్య పురస్కారాల్లో ‘ఉత్తమ వార్తాపత్రిక’ అవార్డును సాధించింది. బెంగళూరులో ‘పీఆర్‌ బియాండ్‌ 20:20’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈనాడు’ ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు. పీఆర్‌సీఐ దేశంలోని ప్రముఖ కమ్యూనికేషన్ ​ఎక్స్ఛేంజ్‌. భారత్‌లోని 32 నగరాలు, పట్టణాల్లోని పీఆర్​, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మీడియా, అడ్వర్టైజింగ్‌, హెచ్ఆర్​ నిపుణులను అనుసంధానం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసింది:యనమల

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా వారి అభ్యున్నతిని సీఎం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని యనమల దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. యెస్‌ బ్యాంకుకు నూతనపాలకవర్గం: సీతారామన్‌

యెస్‌ బ్యాంకు సంక్షోభంపై ప్రభుత్వం 2017లోనే అప్రమత్తమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సదరు బ్యాంకులో పాలనా పరమైన ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని, సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచించామని మంత్రి వెల్లడించారు. దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యెస్‌ బ్యాంకులో 49 శాతం పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ ఆసక్తి చూపిందన్నారు. అంతేకాకుండా యెస్‌ బ్యాంకుకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పట్టణాల్లో స్పష్టమైనమార్పు కనిపిస్తోంది:కేటీఆర్‌

పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో జిల్లాల అదనపు కలెక్టర్లు, పలు విభాగాల అధిపతులు, పురపాలకశాఖ ముఖ్య అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో జియో

టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్‌ జియో మరోసారి వైర్‌లెస్‌ డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో ఉంది. ఇప్పటి వరకు 1జీబీ డేటాకు ఉన్న రూ.15 మొత్తాన్ని రూ.20కి పెంచేందుకు అనుమతి కోరుతూ ట్రాయ్‌కు లేఖ రాసింది. అయితే వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా పెంచిన డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌కు రాసిన లేఖలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రైతుబంధు’ మరోదఫా నిధులు విడుదల

రైతుబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన రైతుబంధు పథకానికి ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాండ్య ఏం కొట్టాడు: 55 బంతుల్లో 158 నాటౌట్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఆకలిగొన్న పులిలా విజృంభిస్తున్నాడు. బంతి దొరికితే చాలు కళ్లు చెదిరే సిక్సర్‌గా మలుస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో మొదలవ్వనున్న ఐపీఎల్‌- 2020లో తన ఆట ఎలా ఉంటుందో మరో టీజర్‌ చూపించాడు. మూడురోజుల క్రితమే డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో కాగ్‌ జట్టుపై 39 బంతుల్లో 105 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 55 బంతుల్లో 158 పరుగులతో అజేయ శతకం అందుకున్నాడు. అభిమానులకు కనువిందు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోహన్‌లాల్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన చిరు

వైవిధ్యమైన కథలను,  పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకు దీటుగా ముందుకు సాగుతున్న మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌. ఆయన కథానాయకుడిగా ప్రియదర్శన్‌ దర్శకత్వంతో తెరకెక్కిన హిస్టారికల్‌ చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’. ప్రియదర్శన్‌ ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అఫ్గాన్‌ సీఈవోపై దాడి

అఫ్గానిస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లా లక్ష్యంగా దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఆయనపై ఈ దాడి జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారిలో అబ్దుల్లాతో సహా, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, శాంతి స్థాపక కౌన్సిల్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ కరీం ఖలీల్‌, డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహమ్మద్‌ మొహైక్‌, ఇతర రాజకీయ నేతలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.