close

తాజా వార్తలు

Published : 08/03/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. ‘ఓడితే ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత’

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఓటమి పాలైతే ఆ ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి మంత్రులు, ఎమ్మెల్యేలపై పడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నైతిక విలువలు ఉండాలనే ఉద్దేశంతోనే మద్యం, డబ్బు పంపిణీ చేపట్టకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నారీశక్తి పురస్కారం అందుకున్న తెలుగు మహిళ

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే నారీశక్తి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం దిల్లీలో అట్టహాసంగా జరిగింది.  2019 సంవత్సరానికి గానూ పలువురు మహిళలకు నారీశక్తి పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతుల మీదుగా అందజేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి పురస్కారం అందుకున్నారు. 1996లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పుర, నగర పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పురపాలక‌, నగర పంచాయతీ పీఠాలకు రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు కేటాయిస్తూ పురపాలక శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ గెజిట్‌ విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 2123 వార్డులకు ఖరారు కాగా.. తాజాగా 103 మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దక్షిణాఫ్రికా సిరీస్‌కు హార్దిక్‌ 

దాదాపు ఆరు నెలల పాటు జట్టుకు దూరమైన భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తిరిగి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హార్దిక్‌తో పాటు గాయాలతో జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎంపికయ్యారు. ఇటీవల చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికైన సునీల్‌కు ఇదే తొలి ఎంపిక. పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విజయవాడకు చెందిన ఎలమందరావు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో జారి పడి ఫ్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీజీపీ కానిస్టేబుల్‌ డేవిడ్‌ రాజు ఇతర ప్రయాణికుల సాయంతో అతడిని పైకి లాగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 33ఏళ్ల నటితో డేటింగ్‌.. 51ఏళ్ల నటుడి రియాక్షన్‌

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ గుర్తింపు పొందిన నటుడు రాహుల్‌ దేవ్‌. ఆయన అనేక సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి మెప్పించారు. కాగా రాహుల్‌ నటి, మోడల్‌ ముగ్దా గాడ్సేతో డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో ఆయనే మీడియాతో చెప్పారు. ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ సమ్మతమేనని అన్నారు. ఆమె దిల్లీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారని కూడా తెలిపారు. తన కుమారుడికి కూడా ఈ విషయం తెలుసని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈడీ కస్టడీకి యెస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు   

యెస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగించారు. మార్చి 11వ తేదీ వరకు ఈ కస్టడీ కొనసాగుతుంది. ఈ విషయాన్ని ముంబయి  కోర్టు ప్రకటించింది. కపూర్‌ను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన దర్యాప్తుకు సహకరించడంలేదని అధికారులు అంతుకు ముందు వెల్లడించారు. కపూర్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మార్చుకొన్నారని ఆయన లాయర్‌ వాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రధాని ప్రశంసించిన మహిళలు..ఎందరికో స్ఫూర్తి

ఒకరు అనాధల ఆకలి తీరిస్తే, మరొకరు సంప్రదాయ కళల కోసం కృషి చేశారు, ఇంకొకరు జీవితంలో గాయపడినా కుంగిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇలా ఒక్కో మహిళది ఒక్కో స్ఫూర్తి వంతమైన కథ. ఎంతో మందికి వారి జీవితాలు స్ఫూర్తినిస్తాయనేందుకు ఉదాహరణ. వారే నేడు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతా ఉపయోగించిన మహిళలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ తన ఖాతాను స్ఫూర్తివంతమైన మహిళలకు అప్పజెప్పనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అలా చెప్పినట్లు వారికి అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.50 లక్షలు పెట్టి కథ కొన్న హీరో?

 నేచురల్‌ స్టార్‌ నాని రూ.50 లక్షలు పెట్టి ఓ కథ కొన్నారట. ఆయన ఇటీవల తన కొత్త ప్రాజెక్టు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’తో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. మేలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోందట. కాగా ఈ సినిమా కథను నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌..!

దేశ రాజధాని దిల్లీలో ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు వేస్తున్న ఓ జంటను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏ(పౌరసత్వం సవరణ చట్టం) నిరసన పేరుతో ఈ దాడులు చేసేందుకు ప్లాన్‌ చేశారని అధికారులు తెలిపారు. కశ్మీర్‌కు చెందిన జహన్‌జేబ్‌ షమీ, హినా బషీర్‌బేగ్‌ భార్యభర్తలు. వీరు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఖోరాసన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌  యూనిట్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో దాడులకు పాల్పడేందుకు ఐసిస్‌కు చెందిన సీనియర్‌ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.