జేఎన్‌యూ ఆహ్వానం
close

తాజా వార్తలు

Published : 09/03/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేఎన్‌యూ ఆహ్వానం

యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు

న్యూదిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి వివిధ యూజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభతో సీటు లభిస్తుంది. దేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల జాబితాలో ఏటా రెండో స్థానంలో ఈ సంస్థ నిలుస్తోంది. ఇక్కడ చదువుకునే అవకాశం పొందినవారు మేటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్ఛు పరీక్షలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతాయి.

ఇవీ కోర్సులు

ఎంఏ: పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఏరియా స్టడీస్‌, ఫిలాసఫీ, జాగ్రఫీ, సోషియాలజీ, డెవలప్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ స్టడీస్‌, డిజాస్టర్‌ స్టడీస్‌, ఆర్ట్స్‌ అండ్‌ ఆస్థెటిక్స్‌, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌, లింగ్విస్టిక్స్‌, సంస్కృతం

ఎమ్మెస్సీ: లైఫ్‌ సైన్సెస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ సైన్సెస్‌, మాలిక్యులర్‌ మెడిసిన్‌

ఎంఏ విదేశీ భాషలు: అరబిక్‌, పర్షియన్‌, జపనీస్‌, కొరియన్‌, చైనీస్‌, జర్మన్‌, రష్యన్‌, స్పానిస్‌, ఫ్రెంచ్‌, పాష్టో

అర్హత: పలు కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును డిగ్రీ స్థాయిలో చదివుండాలి. కొన్నింటికి మాత్రం ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్ఛు ఆయా కోర్సులను బట్టి డిగ్రీలో 45 లేదా 50 లేదా 55 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు

యూజీ స్థాయిలో...

బీఏ: జపనీస్‌, కొరియన్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, రష్యన్‌, స్పానిష్‌, అరబిక్‌, పర్షియన్‌, పాష్టో

ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ, ఎమ్మెస్సీ: ఆయుర్వేద బయాలజీ

అర్హత: పై రెండు కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు

ఎంఫిల్‌, పీహెచ్‌డీ

వివిధ సబ్జెక్టులు, విభాగాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు పీజీ డిప్లొమా ఇన్‌ బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్‌, ఎంటెక్‌..తదితర కోర్సులూ ఉన్నాయి.

ప్రవేశం: అన్ని కోర్సులకూ పరీక్షలో చూపిన ప్రతిభతో లభిస్తుంది. ఎంఫిల్‌, పీహెచ్‌డీలకు మాత్రం పరీక్షకు 70 శాతం, మిగిలిన 30 శాతం వీవాకు వెయిటేజీ ఉంటుంది. ఈ సంస్థలోని బీటెక్‌ కోర్సులకు జేఈఈతో ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష ఇలా

పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆయా సబ్జెక్టులను బట్టి ప్రశ్నల సంఖ్య, ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మార్పులకు అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు

పరీక్షలు: మే 11, 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో చిత్తూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://jnuexams.nta.nic.in


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని