‘వారంలోపే ఆపరిమితి ఎత్తివేస్తారు’
close

తాజా వార్తలు

Published : 10/03/2020 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వారంలోపే ఆపరిమితి ఎత్తివేస్తారు’

ముంబయి: సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది. ఒక్కో డిపాజిటర్‌ నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవడానికి మాత్రమే వీలు కల్పిస్తూ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు తమ నగదు వస్తుందో రాదోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఖాతాదారులు తమ నగదు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ పరిమితిని వారం రోజుల్లో ఆర్బీఐ ఎత్తివేస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌కుమార్‌ అభిప్రాయ పడ్డారు. వాళ్ల డబ్బు భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.

రజనీశ్‌ కుమార్‌ సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘యెస్‌ బ్యాంకుపై విధించిన మారటోరియం వారం రోజుల్లోపే ఆర్బీఐ ఎత్తివేసే అవకాశాలున్నాయి. యెస్‌ సంక్షోభం తర్వాత ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎస్‌బీఐ కలిసికట్టుగా పనిచేశాయి. అయితే, తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసేందుకు, కొత్త మూలధనాన్ని తీసుకురావడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. మూలధనం విషయంలో నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. ఏదేమైనా వారంలో లేదా అంతకంటే తక్కువ వ్యవధిలోనే యెస్‌ బ్యాంకు ఖాతాదారులు శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే యెస్‌ బ్యాంకు కోలుకోవడం చాలా ముఖ్యం. యెస్‌ బ్యాంకును ఆదుకునేందుకు అన్ని విధాలుగా ఎస్‌బీఐ సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే యెస్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 49 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి, రూ.2,450కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎస్‌బీఐ అంగీకరించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని