close

తాజా వార్తలు

Updated : 10/03/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త తరం పాత్రికేయుల కోసం....

అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.

ఎంపిక:

మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ, భృతి: 

ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు ₹ 13,000, తరువాతి ఆరు నెలలు ₹ 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.

ఉద్యోగంలో: 

స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో ₹17,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో ₹ 19,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో ₹ 21,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం

దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. www.eenadu.net, www.eenadupratibha.net లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు రుసుము ₹ 200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.

అర్హతలు: 
* తేట తెలుగులో రాయగల నేర్పు
* ఆంగ్లభాషపై అవగాహన 
* లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు
* ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన
* మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష    
* 1.6.20 నాటికి 28కి మించని వయసు
* డిగ్రీ ఉత్తీర్ణత (డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసేవారూ అర్హులే)

ఒప్పంద పత్రం

స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్‌: 11.03.2020
ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు: 30.03.2020
కోర్సు ప్రారంభం:  01.06.2020


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.