close

తాజా వార్తలు

Published : 11/03/2020 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ బుడతడు..లంచ్‌ బ్రేక్‌లో స్టారయ్యాడు!

తిరువనంతపురం(కేరళ): పాఠశాల.. చాలా మందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి ఆటలాడటం, పాటలు పాడటం వంటివి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే, మనలో చాలా మంది బెంచీపై మ్యాజిక్‌ వాయించడం తెలిసే ఉంటుంది. క్లాస్‌ రూమ్‌కు టీచర్‌ ఆలస్యంగా వచ్చినా.. ఆ రోజు ఏదైనా ప్రత్యేకత ఉన్నా ఇక ఆ రోజు తరగతి మొత్తం సందడే సందడి. తలచుకుంటుంటే ఎంతో బాగుంటుంది కదూ. అయితే, అచ్చం అలాంటి జ్ఞాపకాలనే మళ్లీ గుర్తు తెస్తున్నాడో బాలుడు. ఆ బాలుడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందర్నీ కట్టిపడేస్తోంది.

సనూప్‌.. కేరళలలోని అళప్పుళ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. చదివేది మూడో తరగతే అయినా.. సొంతంగా ట్యూన్స్‌ కూడా తయారు చేస్తాడు. ఆ బుడతడికి సంగీతమంటే చాలా ఇష్టం. ఇలా ఓ రోజు లంచ్‌ బ్రేక్‌లో తన తోటి విద్యార్థులతో కలిసి నిల్చొని బెంచీపై కేరళ సంప్రదాయ సంగీతాన్ని వాయించాడు. ఆ దృశ్యాన్ని జయశంకర్‌ అనే ఉపాధ్యాయుడు వీడియో ద్వారా చిత్రీకరించారు. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం .. ఆ వీడియో లక్షల్లో లైకులు సంపాదించింది. అలా ఆ బాలుడు లంచ్‌బ్రేక్‌లోనే స్టార్‌ అయిపోయాడు. సనూప్‌ తండ్రి కొబ్బరి కాయల వ్యాపారం చేస్తుంటారు. అన్నయ్య అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.