close

తాజా వార్తలు

Published : 12/03/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరికొత్తగా రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్‌.. నోట్‌ 9 ప్రో

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తూ యువతకు బాగా దగ్గరైన బ్రాండ్‌ రెడ్‌మి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షామీ సబ్‌ బ్రాండ్‌గా రెడ్‌మి సిరీస్‌లో అనేక ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్‌, రెడ్‌మి నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గురువారం జరిగిన ఈవెంట్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలతో పాటు, ధరలను కూడా ప్రకటించారు. 

రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుంది. దీంతో పాటు, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుంది. వీటి ధరలు వరుసగా రూ.16,999, రూ.18,999గా నిర్ణయించారు. 

రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ ప్రత్యేకతలు

రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రానుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను వినియోగించారు.(ఇటీవల విడుదలైన రియల్‌మి 6ప్రోలోనూ ఇదే ప్రాసెసర్‌ ఉంది) వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ (120 డిగ్రీలు), 5 మెగాపిక్సెల్‌ మాక్రో లెన్స్‌, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలు అమర్చగా, ముందువైపు 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో రానుంది. 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్‌ 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ను సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో తీసుకొచ్చారు.

మిడ్‌ రేంజ్‌లో రెడ్‌మి నోట్‌ 9ప్రో

రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌తో పాటు మిడ్‌ రేంజ్‌లో రెడ్‌మి నోట్‌9ప్రోను కూడా విడుదల చేశారు. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.15,999గా నిర్ణయించారు. ప్రత్యేకతల విషయానికొస్తే ఇది 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రానుంది. ఇందులోనూ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుకవైపు నాలుగు కెమెరాలున్నాయి. అయితే, ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్‌ కాగా, సెల్ఫీ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్‌ పంచ్‌ హోల్‌ కెమెరాను ఇచ్చారు. 5020 బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్‌ 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

రెడ్‌మి నోట్‌ 9ప్రో మార్చి 17వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు ఎం.కామ్‌లో లభ్యమవుతుంది. రెడ్‌మి నోట్‌ 9ప్రో మ్యాక్స్‌ మార్చి 25వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌పై ఆఫర్ల వివరాలను మార్చి 16న ప్రకటిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.