క్రీడల్లో ప్రభావవంత మహిళగా నీతాఅంబానీ
close

తాజా వార్తలు

Published : 12/03/2020 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రీడల్లో ప్రభావవంత మహిళగా నీతాఅంబానీ

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. 2020 సంవత్సరానికి గానూ క్రీడల్లో అత్యంత ప్రభావవంతులైన మహిళల జాబితాలో టాప్‌ 10లో చోటు సంపాదించారు. స్పోర్ట్స్‌ బిజినెస్‌ నెట్‌వర్క్‌, ఐ స్పోర్ట్స్‌ కనెక్ట్‌ సంస్థలు తాజాగా క్రీడల్లో అత్యంత ప్రభావం చూపించే మహిళల(2020) జాబితాను విడుదల చేశాయి. అందులో భాగంగా భారత్‌ నుంచి ఐపీఎల్‌ ముంబయి ఇండియన్స్‌ జట్టు ఫ్రాంఛైజీ నీతా అంబానీ చోటు సంపాదించడం విశేషం. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘నీతా అంబానీ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆమె దేశవ్యాప్తంగా అనేక క్రీడా ప్రాజెక్టుల్లో పాల్గొంటున్నారు’అని పేర్కొన్నాయి. 

అదేవిధంగా ఈ జాబితాలో ప్రముఖ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌కు కూడా స్థానం దక్కింది. ఈమె ప్రపంచ స్థాయి అథ్లెట్‌ మాత్రమే కాకుండా.. క్రీడల్లో మహిళల కోసం గళాన్ని వినిపిస్తోందని వెల్లడించింది.  వీరితో పాటు టాప్‌ 10 జాబితాలో ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారులు సెరెనా విలియమ్స్‌, నవోమీ ఒసాకా సహా పలువురు స్థానం సంపాదించారు. నీతా అంబానీ ఫ్రాంఛైజీ వహిస్తున్న ఐపీఎల్‌ ముంబయి ఇండియన్స్‌ జట్టు నాలుగు సార్లు ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని