close

తాజా వార్తలు

Published : 14/03/2020 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌: ఆరెస్సెస్‌ సమావేశాలు వాయిదా

నాగ్‌పూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది. ఆరెస్సెస్‌లో అత్యున్నత నిర్ణాయక విభాగం అయిన ఏబీపీఎస్‌ ఏటా ఒకసారి సమావేశమవుతూ ఉంటుంది. వైరస్‌ దేశంలో క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరెస్సెస్‌ ప్రధాన కార్యదర్శి సురేశ్‌ భయ్యాజీ జోషి తెలిపారు. వైరస్‌ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా స్థానిక యంత్రాంగంతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వయంసేవకులను కోరారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.