close

తాజా వార్తలు

Updated : 15/03/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో 93కు చేరిన కరోనా కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ ప్రకారం దేశంలో 93 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులు కాగా.. ఇద్దరు మృతి చెందారు. మరో 9 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 12,29,363 మందిని స్క్రీన్‌ చేశారు. భారత్‌లో ఈ వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ కట్టడి చేపట్టాల్సిన అన్ని ప్రత్యామ్నాయాల్నీ సూచించింది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రకటించి వాటి తయారీని పెంచాలని సదరు సంస్థలను ఆదేశించింది.

రాష్ట్రాల్లో కరోనా హెల్ప్‌లైన్‌ నంబర్లివే..
> అత్యవసర సమయాల్లో దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్, తెలంగాణ భవన్ కమిషనర్ సంప్రదించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు : 01123382031, తెలంగాణకు 01123382041 ల్యాండ్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు
 చేశారు.

> కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది.  

ఆంధ్రప్రదేశ్ : 0866-2410978
అరుణాచల్ ప్రదేశ్ : 9436055743
అసోం: 6913347770
ఛత్తీస్‌గఢ్ : 07712235091
దిల్లీ : 01122307145
హరియాణా: 8558893911
జమ్మూ: 01912520982
కశ్మీర్: 01942440283
కేరళ: 04712552056
లద్దాఖ్: 01982256462
మధ్యప్రదేశ్ : 0755-2527177
మహారాష్ట్ర: 020-26127394
నాగాలాండ్: 7005539653
ఒడిశా: 9439994859
రాజస్థాన్: 01412225624
తమిళనాడు: 04429510500
త్రిపుర: 03812315879
ఉత్తర్‌ప్రదేశ్: 18001805145
పశ్చిమబెంగాల్: 3323412600
అండమాన్ & నికోబార్‌ : 03192232102

> తెలంగాణ, బీహార్, గోవా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, దాద్రా నగర్ హవేలి, దామణ్‌ దీవ్‌, లక్షద్వీప్, పుదుచ్చేరి హెల్ప్ లైన్ నంబర్ 104

> మేఘాలయ హెల్ప్‌లైన్ నెంబర్ 108 కాగా, మిజోరం హెల్ప్‌లైన్ నెంబర్ 102. 

భారత్‌ చేరుకున్న ఇరాన్‌లోని భారతీయులు...
ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఎయిరిండియా విమానం ఈరోజు తెల్లవారుజామున ముంబయికి చేరుకుంది. మొత్తం 234 మొత్తం భారతీయులు ఇందులో ఉన్నారు. వీరిలో 131 మంది విద్యార్థులు కాగా.. 103 మంది పర్యాటకులు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులకు, ఇరాన్‌ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు ఇరాన్‌లో వైరస్‌ బారిన పడి 967 మంది మరణించగా.. మరో 611 మంది బాధితులుగా మారారు. వీరంతా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఉండనున్నారు. 14 రోజుల పాటు వీరిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతుంది. మరోవైపు ఇటలీలోని మిలన్‌లో ఉన్న భారత విద్యార్థులు ఎయిరిండియా విమానంలో భారత్‌కు చేరుకున్నారు.  

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.