close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/03/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు 1

ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ- 85 పోస్టులు

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 85 పోస్టులు: చీఫ్‌ డిజైన్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ వెటర్నరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: ఏప్రిల్‌ 02, 2020.

వెబ్‌సైట్‌:
https://www.upsc.gov.in/


ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, గుంటూరు

చెన్నైలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం... గుంటూరు(ఏపీ) అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన 7 జిల్లాలవారు (అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం) దీనికి అర్హులు.
*ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

పోస్టులు: సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/ సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నరీ కేటగిరీ. అర్హత: ఎనిమిదో తరగతి, పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 17-23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌(పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ), మెడికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా. ర్యాలీ నిర్వహణ తేది: 2020, మే 05 నుంచి 17 వరకు.
ర్యాలీ ప్రదేశం: భారతీయార్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ స్టేడియం, కోయంబత్తూరు(తమిళనాడు). దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 19 వరకు.

వెబ్‌సైట్‌:
http://www.joinindianarmy.nic.in/


టీహెచ్‌ఎస్‌టీఐ, ఫరీదాబాద్‌

ఫరీదాబాద్‌లోని భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ) కింది అడ్మినిస్ట్రేటివ్‌, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 29 పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/  స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: ఏప్రిల్‌ 08, 2020. వెబ్‌సైట్‌: https://thsti.in/


ప్రవేశాలు
సీయూసెట్‌ - 2020


దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే సీయూసెట్‌-2020 ప్రకటన విడుదలైంది. రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.
* సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూసెట్‌) - 2020
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. రాతపరీక్ష తేది: 2020 మే 30, 31.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 16, 2020. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 11, 2020.

వెబ్‌సైట్‌:
https://cucetexam.in/
 


ఐఐఐటీఎం, కేరళ

కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఐటీఎం-కే) 2020-21 విద్యాసంవత్సరానికి కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాములు: ఎంఎస్సీ, ఎంఫిల్‌ విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ (సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిటిక్స్‌, జియోస్పేషియల్‌ అనలిటిక్స్‌), ఎకలాజికల్‌ ఇన్ఫర్మాటిక్స్‌. అర్హత: పీజీ ప్రోగ్రాములకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఫిల్‌ ప్రోగ్రాములకు ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత,  గేట్‌/  నెట్‌ అర్హత. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష తేది: 2020, జూన్‌ 13. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరితేది: 2020, మే 22.

వెబ్‌సైట్‌:
https://www.iiitmk.ac.in/


వాక్‌-ఇన్స్‌
నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే

గువాహటి(మాలేగావ్‌) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 29

పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్‌
సబ్జెక్టులు: జువాలజీ, బయాలజీ, హిస్టరీ, ఎకనమిక్స్‌, ఇంగ్లిష్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీఈడీ, టెట్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: 2020 మార్చి 30, 31.
వేదిక: జనరల్‌ మేనేజర్‌, జీఎం ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మాలేగావ్‌, నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే, గువాహటి.

వెబ్‌సైట్‌:
https://nfr.indianrailways.gov.in/


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.