కుటీర విద్య
close

తాజా వార్తలు

Published : 16/03/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటీర విద్య

కుటీర పరిశ్రమలు తెలుసు.. ఈ కుటీర విద్య ఏంటి అనుకుంటున్నారా? ప్రాచీన కాలంలో గురుకులాలు కుటీరాల్లోనే నిర్వహించే వారు. ఇదే స్ఫూర్తితో కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కార్‌కలా తాలుకాలోని 13 పాఠశాలలను రోజులో ఓ గంట కుటీరాల్లోనే నడుపుతున్నారు. మిగతా సమయం మాత్రం మాములుగానే నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రకృతిని పరిచయం చేయడమే తమ ఉద్దేశం అంటున్నారు అక్కడి వారు. 2019లో ప్రారంభమైన ‘స్వర్ణ కార్‌కలా.. స్వచ్ఛ్‌ కార్‌కలా’లో భాగంగా ఈ కుటీరాల్లో విద్యాబోధన చేస్తున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులు కుటీరాల్లో చదువుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే వీటిలో బ్లాక్‌బోర్డులు వాడరు. కేవలం మౌఖికంగానే విద్యాబోధన చేస్తున్నారు. కొన్నిసార్లు కృత్యాధారంగానూ (యాక్టివిటీ బేస్డ్‌) తరగతులు నిర్వహిస్తున్నారు. బుట్టలు, చాపల అల్లికలో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కుటీరంలో 50 మంది వరకు విద్యార్థులుంటారు. వీటిని ప్రకృతికి మేలు చేసే వస్తువులు, పదార్థాలైన గడ్డి, కొబ్బరి మట్టలు, వక్క చెట్ల ఆకులు, కలప, వెదురుతో నిర్మించారు. నేలను సైతం ఆవుపేడతో అలుకుతారు. వీటి పేర్లూ కవి ముద్దన, నలందా, పంచవటి, విక్రమశిల, వర్ణ వాటిక ఇలా సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం మరి కొన్ని పాఠశాలల్లో కుటీరాల నిర్మిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని