close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/03/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చక్కగా చెప్పేలా..వివరంగా వినేలా!

దివ్యాంగుల బోధనకు ప్రత్యేక శిక్షణ 

భావ వ్యక్తీకరణ లోపాల సవరణకు కోర్సులు

సాధారణ విద్యార్థులకు బోధించటం వేరు. దివ్యాంగులకు బోధించటం వేరు. సరిగా పలకలేని, వినికిడి సరిగా లేనివారి భావవ్యక్తీకరణ లోపాలను సరిదిద్దాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమవుతుంది. ఇందుకోసం ఏర్పాటైన అటానమస్‌ సంస్థ.. మైసూరులోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌). భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ 2020-21 సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది.

ఈ కోర్సులు పూర్తిచేసినవారికి ఉపాధి అవకాశాలు బాగుంటాయి!
స్పీచ్‌ -లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆడియోలజీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అంశాల్లో జాతీయస్థాయిలో పేరుపొందిన ఏఐఐఎస్‌హెచ్‌ మొత్తం 18 ప్రోగ్రాములను అందిస్తోంది. గ్రంథాలయం, సమాచార కేంద్రం, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని 11 విభాగాలతో నడిచే ఈ సంస్థ విద్యార్థులకు ఇంటర్‌ డిసిప్లినరీ శిక్షణను అందిస్తోంది.
జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష స్కోరు ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌), డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు ఎంట్రన్స్‌ ఏమీ లేకుండా ప్రవేశం లభిస్తుంది. ఈ అన్ని కోర్సుల్లో చేరినవారికి  ప్రతినెలా స్టైపెండ్‌/ఫెలోషిప్‌ లభిస్తుంది.

ఏయే కోర్సులు?
డిప్లొమా ప్రోగ్రాములు
1. డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ ఇయర్‌ మోల్డ్‌ టెక్నాలజీ:  కోర్సు వ్యవధి ఏడాది. సీట్లు 28. అర్హత: 12వ తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశం
2. డిప్లొమా ఇన్‌ అర్లీ చైల్డ్‌ హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ((హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌): కోర్సు వ్యవధి ఏడాది. సీట్లు 28. అర్హత: 12వ తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశం
3. డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ త్రూ వీడియో కాన్ఫరెన్స్‌ మోడ్‌): కోర్సు వ్యవధి ఏడాది. ఒక్కో స్టడీ సెంటరుకు 28 సీట్లు. అర్హత: సైన్స్‌ స్ట్రీములో 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం  
బ్యాచిలర్స్‌ ప్రోగ్రాములు
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియోలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ: కోర్సు వ్యవధి 4 ఏళ్లు. 68 సీట్లు. ఎంట్రన్స్‌ స్కోరు ద్వారా ప్రవేశం.
2. బి.ఇడి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌): కోర్సు వ్యవధి 2 ఏళ్లు. 22 సీట్లు. ఏదైనా డిగ్రీ మార్కుల ఆధారంగా ప్రవేశం.
పీజీ డిప్లొమా కోర్సులు
1. పీజీ డిప్లొమా ఇన్‌ ఆగ్మెంటేటివ్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ కమ్యూనికేషన్‌: (ఏడాది). 22 సీట్లు. బీఎస్‌సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌)/ బీఏఎస్‌ఎల్‌పీ/బీఎస్‌ఈడీ మార్కుల ఆధారంగా ప్రవేశం.
2. పీజీ డిప్లొమా ఇన్‌ క్లినికల్‌ లింగ్విస్టిక్స్‌ ఫర్‌ స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ: (ఏడాది). 12 సీట్లు. బీఎస్‌సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌)/ బీఏఎస్‌ఎల్‌పీ మార్కుల ఆధారంగా ప్రవేశం.
3. పీజీ డిప్లొమా ఇన్‌ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: (ఏడాది). 12 సీట్లు.  బీఎస్‌సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌)/ బీఏఎస్‌ఎల్‌పీ/ బీఎస్‌సీ (పీ/ఎం/ఈ/సీఎస్‌/ బీటెక్‌/ఎంబీబీఎస్‌ మార్కుల ఆధారంగా ప్రవేశం.
4. పీజీ డిప్లొమా ఇన్‌ న్యూరో ఆడియోలజీ: (ఏడాది). 12 సీట్లు. బీఎస్‌సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌)/ బీఏఎస్‌ఎల్‌పీ మార్కుల ఆధారంగా ప్రవేశం.
ఇంకా మాస్టర్స్‌, డాక్టొరల్‌, పోస్ట్‌ డాక్టొరల్‌ ప్రోగ్రాములను కూడా ఈ సంస్థ అందిస్తోంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29 ఏప్రిల్‌ 2020
             
   పరీక్ష తేదీ: 16 మే 2020
మరిన్ని వివరాలకు 
https://aiishmysore.in/en/ లో సంప్రదించవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.