వయసుకుచెరకు
close

తాజా వార్తలు

Published : 16/03/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వయసుకుచెరకు

చెరకురసం కేవలం దాహార్తిని తీర్చడానికే పరిమితం కాదు... ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి... 

ఐరన్‌, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండే చెరకురసం డీహైడ్రేషన్‌ను తగ్గించడంతోపాటు.. సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. శరీరంలోని ప్రొటీన్ల స్థాయిని పెంచుతుంది.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నయం చేసి, మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

చెరకులోని పీచు కారణంగా జీర్ణశక్తి పెరిగి.. అజీర్తి, అల్సర్‌ వంటి అనారోగ్యాలు దరిచేరవు. ●

ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.●

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్యఛాయల బారినపడకుండా చర్మాన్ని సంరక్షిస్తాయి.

శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు బయటి పంపే శక్తి ఈ రసానికి ఉంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకునేవారిలో బరువు నియంత్రణలో ఉంటుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని