close

తాజా వార్తలు

Updated : 16/03/2020 21:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ఆ వివరాలివ్వండి.. హోంశాఖకు ఇస్తా: పవన్‌

 స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ దశలో చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్‌ ఇచ్చినా.. బలవంతంగా ఉపసంహరింపజేయడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగం పనిచేయడం బాధాకరమన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

2. మరోసారి నిలిచిపోయిన అమెరికా మార్కెట్లు

అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే ఎస్‌ అండ్‌ పీ 500 షేర్లు 8శాతం నష్టాల్లోకి జారుకోవడంతో మార్కెట్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా: 2 రాష్ట్రాల్లో పుర ఎన్నికలు వాయిదా

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేలా ప్రజల్ని జన సమూహాలను దూరంగా ఉంచాలనే సంకల్పంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిన్న సంచలన నిర్ణయం తీసుకోగా.. తాజాగా పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రలూ అదే బాటలో వెళ్లాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా అప్‌డేట్స్‌: బాధితులు @ 116

4. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: చంద్రబాబు

 సీఎం జగన్‌ తన మొండి వైఖరి, వితండవాదం వీడి 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంపై రాబోయే రెండు మూడు వారాలు చాలా కీలకమని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందితే అదుపుచేయడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్‌ పూర్తిగా లేదని ప్రకటించేవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహారాష్ట్రలో ఆలయాలు మూసివేత

కరోనా వైరస్‌ ప్రభావంలో మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ముంబయిలోని అతి ప్రాచీన సిద్ధివినాయక ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ గుడి తలుపులు మూసే ఉంటాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మరో ప్రముఖ ఆలయం తుల్జా భవాని ఆలయం. మార్చి 17 నుంచి 31 వరకూ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కమల్‌నాథ్‌ సర్కార్‌కు గవర్నర్‌ డెడ్‌లైన్‌

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనా భయాందోళనల నేపథ్యంలో మార్చి 26వరకు వాయిదా పడటంతో కమల్‌ సర్కార్‌కు కాస్త ఊరట లభించిందనుకున్న కొద్ది గంటల్లోనే మరో షాక్‌ తగిలింది. మంగళవారంలోగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. ఒకవేళ రేపటిలోగా బలం నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడిందని పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బయటపెట్టరెందుకు? రాహుల్‌ గాంధీ 

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు శూన్యమని.. రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు దివాలా తీయనున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో గుదిబండలా తయారైన అనుత్పాదక రుణాల అంశాన్ని ఆయన నేటి లోక్‌సభ సమావేశంలో లేవనెత్తారు. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేయటంలో తొలి 50 స్థానాల్లో ఉన్న వారి పేర్లను, వారి నుంచి బాకీ వసూలుకు మోదీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో అనే వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికాకు ‘జాక్‌ మా’ సాయం..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గ్గజం ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు ‘జాక్‌ మా’ ఇప్పటికే భారీ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా ట్విటర్‌లో ఖాతా తెరిచిన ‘జాక్‌ మా’ అమెరికాకు మాస్కులను, కరోనా పరీక్షల కిట్‌లను పంపిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అమెరికాలో ఉన్న మిత్రులందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అంటూ మొదటి ట్విట్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే భారీగా అభిమానులు స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మార్చి 18 నుంచి యెస్‌ బ్యాంక్‌ సేవలు

గత పది రోజులుగా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయి అవస్థలు పడుతున్న యెస్‌ బ్యాంక్‌ వినియోగదారులకు ఊరట కలగనుంది. బుధవారం సాయంత్రం నుంచి తిరిగి పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నట్లు యెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తమ అధికారిక ట్విటర్‌ ఖాతా వేదికగా వెల్లడించింది. ‘మార్చి 18, 2020 బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి బ్యాంక్‌ సేవలు పునరుద్ధరించనున్నాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళ మృతి

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన తూర్పుగోదావరికి చెందిన ఓ మహిళ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మహిళ (38) ఈ నెల 11న దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి 13న స్వగ్రామం అంతర్వేదికి చేరుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు ఈ నెల 15న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.