close
Array ( ) 1

తాజా వార్తలు

అందాల గురివిందను!

హాయ్ ఫ్రెండ్స్..బాగున్నారా? నేనండీ  గురివింద మొక్కను నేను ఎవరో.. నా సంగతులేంటో మీకు పెద్దగా తెలిసుండకపోవచ్చు  కానీ మీ  ఇంట్లో వాళ్లకు తెలిసి ఉంటుంది అందుకే న గురించి చెప్పుకొదమని ఇదిగో ..ఇలా వచ్చా!! 


పాకేస్తా.. ఎదిగేస్తా

* నేను తీగజాతికి చెందిన మొక్కను.
* నేను చెట్లను ఆధారంగా చేసుకుని పైకి పాకేస్తా.
* నన్ను మీరైతే గురివింద మొక్క అని పిలుస్తారు కానీ.. నా శాస్త్రీయ నామం ఏబ్రస్‌ ప్రికటోరియస్‌.
* రక్తకా, కాకజంఘ, శిఖండిని, గురిజ అనే పేర్లూ నాకు ఉన్నాయి.
* నేను ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కను.


నాలో రకాలున్నాయి

* నాకు కాసే గింజలను గురివింద గింజలు అంటారు.
* ఇవి చూడడానికి భలే విచిత్రంగా ఉంటాయి.
* పైనంతా ఎరుపు రంగులో.. కిందేమో నలుపు రంగులో కనిపిస్తాయి.
* కానీ పూర్తిగా తెలుపులో, ఆకుపచ్చ, పసుపు రంగు గింజల్ని ఇచ్చే రకాలూ ఉన్నాయి.
* కాకపోతే అవి చాలా అరుదు.
* నా గింజలను పూర్వకాలంలో గిరిజనులు పూసల దండలుగా తయారు చేసుకుని మెడలో వేసుకుని తెగ మురిసిపోయేవారు.


ఆకులు తుమ్మలా.. కాయలు చిక్కుడులా..

* నా ఆకులు కాస్త తుమ్మ చెట్టు ఆకులను పోలి ఉంటాయి.
* కాయలేమో కొంచెం చిన్న చిక్కుడు కాయల్లా కనిపిస్తాయి.
* నా పుట్టినిల్లు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు.
* ఇతర సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాల్లోనూ నేను విస్తరించి ఉన్నా.


నా ఎత్తు బంగారం!

* కొంత కాలం క్రితం వరకు నా గింజల్ని బంగారం తూకం కోసం ఉపయోగించేవారు.
* గురివింద ఎత్తు బంగారం అనే మాట ఇప్పటికీ కొన్ని చోట్ల వాడుకలో ఉంది.
* నా మరో ప్రత్యేకత ఏంటంటే.. మాకు కాసే గింజలన్నీ ఒకే బరువు, ఒకే  పరిమాణం ఉంటాయి.
* నన్ను గతంలో బంగారం తూకంలో వాడటానికి ఇదే అసలు కారణం.


గింజల్లో విషం.. ఆకుల్లో ఔషధం!

* నా గింజలు చాలా గట్టిగా ఉంటాయి.
* ఇవి చాలా విష పూరితం. నేను మీ నోట్లోకి వెళితే వికారం, వాంతులు, మూర్ఛ రావొచ్చు. కాలేయం దెబ్బతినొచ్చు.
* కానీ నా ఆకులు, వేర్లలో మాత్రం ఔషధ గుణాలున్నాయి. జ్వరాలు, దగ్గు, జలుబును తగ్గిస్తానని నమ్ముతారు.
* సంప్రదాయ ఆయుర్వేదంలో నన్ను విరివిగా ఉపయోగిస్తారు.
* కొన్ని ప్రాంతాల్లో నా గింజలతో కళాకృతులూ తయారు చేస్తారు. అవి చాలా అందంగా ఉంటాయి.
* గురివింద గింజలను కాల్చితే వచ్చే పొగతో దోమలు దూరంగా పారిపోతాయి అంటారు.


లోతుకు పాతుకు పోతా!

* నేను చూస్తే చిన్న తీగ జాతి మొక్కలా కనిపిస్తాను కానీ.. నా వేర్లు మాత్రం భూమిలో చాలా లోతుకు పాతుకుపోయి ఉంటాయి.
* నన్ను అంత తేలిగ్గా ఎవరూ పెకిలించలేరు.
* నేను చాలా వేగంగానూ పెరుగుతాను.
* ఏ తెగుళ్లూ.. నన్ను ఏమీ చేయలేవు. పశువులూ నన్ను తినవు.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.