close
Array ( ) 1

తాజా వార్తలు

క్రిమిరహితంగా  ఉతికేద్దాం!

కరోనా కలవరపెడుతున్న వేళ... అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే వేసుకునే దుస్తులు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఎప్పటికప్పుడు సూక్ష్మక్రిమిరహితం చేయాలి. అందుకే ఉతికేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేమిటంటే...

కెట్‌ చల్లటి నీటిలో పెద్ద చెంచా బ్లీచ్‌ ద్రావణం కలపాలి. ఈ నీటిలో దుస్తులను పదిహేను నిమిషాల వరకు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. చిన్నారుల డైపర్లు, అనారోగ్యం ఉన్నవారికి సంబంధించిన దుస్తులను అరగంటకు పైగా నానబెట్టినప్పుడు మాత్రమే వ్యాధికారక సూక్ష్మజీవులను నిర్మూలించవచ్ఛు ఇప్పుడు దుస్తులను వేడినీటిలో వేసి బ్లీచ్‌ పోయేలా బాగా రుద్దాలి. ఆ తరువాత వాషింగ్‌ మిషన్‌లో వేయడమో లేదా సాధారణంగా ఉతకడమో చేయాలి.

బ్లీచింగ్‌తో...

వేడినీటిలో డిటర్జెంట్‌, కొద్దిగా బ్లీచ్‌ వేసి కరిగేలా చూడాలి. తెల్లటి దుస్తులకు క్లోరిన్‌ ఉండే బ్లీచ్‌ను వాడాలి. ‘ఆల్‌ ఫ్యాబ్రిక్‌ బ్లీచ్‌’ అనేది మార్కెట్‌లో దొరుకుతుంది. దీన్ని రంగు దుస్తులకు ఉపయోగించవచ్ఛు దుస్తులు శుభ్రమయ్యాక వాటిని డ్రయ్యర్‌లో ఆరబెట్టాలి. ఎండలో ఆరేస్తే మరీ మంచిది. సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి.

టీట్రీ ఆయిల్‌/ లావెండర్‌తో కూడా...

ఈ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సహజంగానే యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. కాబట్టి దుస్తులను మెషిన్‌లో ఉతికేటప్పుడు రెండు మూడు చుక్కల ఆయిల్‌ను డిటర్జెంట్‌కు కలిపితే సరి. దుస్తులు క్రిమిరహితంగా మారడమే కాకుండా సువాసనలను వెదజల్లుతాయి.

బ్లీచ్‌ లేకుండా....

దుస్తులను శుభ్రం చేయడానికి బ్లీచ్‌ వాడటం ఇష్టం లేనివారు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, బోరాక్స్‌లను ఉపయోగించవచ్ఛు అరబకెట్‌ నీటిలో రెండు కప్పుల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, కప్పు బోరాక్స్‌ను కలపాలి. ఇందులో దుస్తులను 15 నుంచి 30 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తరువాత వేడినీటితో వీటిని శుభ్రం చేయాలి. వీటిని వాషింగ్‌ మెషిన్‌ లేదా చేత్తో మాములుగా ఉతకాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.