టైలర్‌ కొడుకు జాతీయ స్థాయికి...
close

తాజా వార్తలు

Published : 21/03/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైలర్‌ కొడుకు జాతీయ స్థాయికి...

సో.. హ్యాండ్‌సమ్‌!!

రంగు రంగుల దుస్తుల్ని కుట్టే ఓ టైలర్‌ తండ్రి.. తన కొడుకు జీవితమూ ఇంద్రధనుస్సులా మెరవాలనుకున్నాడు..చదువే అందుకు ప్రధాన వేదిక అనుకున్నాడు..అది గ్రహించిన కొడుకు ఇంజినీరింగ్‌ చదువుతూనే తనలోని ‘ఫ్యాషన్‌’కి పదునుపెట్టాడు. మోడల్‌గా మారాడు.. జాతీయ స్థాయిలో మిస్టర్‌ ఇండియాగా ద్వితీయ స్థానంలో నిలిచాడు.. తనెవరంటే... షేక్‌ సాజిద్‌. అంతర్జాతీయ స్థాయిలో మోడల్‌గా ఎదగడమే లక్ష్యంగా సాగిపోతున్నాడు సాజిద్‌..

‘‘మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నా. నాన్న టైలర్‌. అమ్మ కూడా ఇంట్లోనే ఉంటూ నాన్నకి సాయపడుతుంది. బాడీబిల్డింగ్‌లో మా మామయ్య నాకు స్ఫూర్తి. చదువుకుంటూనే బాడీ బిల్డింగ్‌లో పేరు సంపాదించాలన్న కోరికతో దీనిపై దృష్టి పెట్టాను. మా నాన్న టైలరింగ్‌ వృత్తి చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. దీనికి తోడు మా అమ్మనాన్నల ప్రోత్సాహం తోడవడంతో నాకు జాతీయ స్థాయిలో రన్నరప్‌గా నిలిచే అవకాశం దక్కింది. దిల్లీలో జరిగిన గ్లోబల్‌ మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఆసియా ఇంటర్నేషనల్‌ ఇండియా 2019-20 జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో రన్నరప్‌గా నిలిచా. మోడలింగ్‌లో ప్రపంచ స్థాయిలో పెద్ద మోడల్‌గా ఎదగడమే నా లక్ష్యం. చెన్నైలో చదువుకుంటూనే మోడలింగ్‌, బాడీబిల్డింగ్‌పై శ్రద్ధ చూపాను. రోజులో ఎక్కువ గంటలు సాధన చేశా. నా డైట్‌ నేనే తయారు చేసుకున్నా. డైట్‌ కోసం నెలకి రూ.25వేలకు పైగా ఖర్చు అయ్యేది.

- సరస్వతుల శివకుమార్‌, ఈనాడు డిజిటల్‌, చెన్నై


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని