close

తాజా వార్తలు

Published : 23/03/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్ని బంకుల్లో బీఎస్‌-6 ఇంధన సరఫరా: ఐఓసీ

దిల్లీ: దేశవ్యాప్తంగా బీఎస్‌-6 ఇంధన సరఫరాను ప్రారంభించిన మొదటి సంస్థగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అవతరించింది. ఏప్రిల్‌ 1 గడువు కంటే రెండు వారాల ముందే బీఎస్‌-6 ఇంధనాన్ని.. దేశవ్యాప్తంగా ఉన్న 28,000 పెట్రోల్‌ బంకుల్లో సరఫరా చేస్తున్నట్లు ఐఓపీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ప్రమాణాలకు కేవలం మూడేళ్లలో మారామని, ప్రపంచంలో మరే దేశం ఇలాంటి ఘనత సాధించలేదని సంజీవ్‌ అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండానే బీఎస్‌-6కు మారామని తెలిపారు. ఇతర చమురు రిటైల్‌ సంస్థలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కూడా బీఎస్‌-6 ఇంధనం సరఫరా చేస్తున్నాయి. అయితే తమ బంకులన్నింటికీ బీఎస్‌ 6 ఇంధనాన్ని సరఫరా చేసేందుకు వీటికి మరోవారం సమయం పట్టే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.