close

తాజా వార్తలు

Updated : 23/03/2020 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇటలీలో కాస్త తగ్గిన మరణాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీలో నిన్నటితో పోలిస్తే ఆదివారం మరణాల సంఖ్య తగ్గడం ఆ దేశ ప్రజలకు కొంచె ఊరట కలిగింది. ఇప్పటికే పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిన ప్రజలు మరికొన్ని రోజుల పాటు ఇదే తరహాలో సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఇలాగే సహకరిస్తే మరికొన్ని రోజుల్లో మహమ్మారి జయిస్తామని భరోసా నింపింది. ప్రజల త్యాగానికి ఫలితం లభిస్తోందనడానికి ఇదే నిదర్శనమని ధైర్యం నూరిపోసింది. ప్రజలంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిస్తూనే.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించింది. వైరస్‌ బారిన పడి ఆదివారం 651 మంది మృతిచెందారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 5,476కు చేరింది. శనివారం 793 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాధితుల సంఖ్య మరో 10.4శాతం పెరిగి 59,138కి చేరింది. వీటిలో చాలా వరకు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న లోంబార్డీ ప్రాంతంలోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్‌పై పోరుకు అమెరికా సైనిక సాయం కావాలని ఇటలీ ప్రభుత్వం కోరింది.

ఇటలీ దుస్థితి వస్తుందేమో.. బ్రిటన్‌

వైరస్‌ తీవ్రత బ్రిటన్‌లో పెరుగుతోందని స్వయంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. వైరస్‌ను ఈ దశలోనే కట్టడి చేయలేకపోతే ఇటలీ దుస్థితి ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరో రెండు, మూడు వారాల్లో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోనే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు. జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్‌ ఎక్కువవున్న నేపథ్యంలో జాన్సన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీస్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలకు అపరిమిత అధికారాలు అప్పజెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రులు ప్రధానికి సూచించడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. బ్రిటన్‌లో మరణాల సంఖ్య ఆదివారం నాటికి 281కి పెరిగింది. బాధితుల సంఖ్య 5,683కు చేరింది.

మరో మార్గం లేదు.. స్పెయిన్‌

స్పెయిన్‌లో విధించిన అత్యయిక స్థితిని ఏప్రిల్‌ 11 వరకు పొడగించాలని పార్లమెంటును కోరతానని ప్రధాని పెడ్రో శాంఛెజ్‌ తెలిపారు. కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. వైరస్‌ కట్టడికి ఇంతకంటే వేరే మార్గం లేదంటూ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆదివారం స్పెయిన్‌లో మరో 394 మంది వైరస్ బారిన పడి మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1772కు చేరింది. కొత్తగా మరో 3,636 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 28,873కు పెరిగింది.

కోలుకున్నవారు 72,703.. చైనా

ఇక తొలుత వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఆదివారం స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, విదేశాల నుంచి వచ్చిన 39 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ వైరస్‌ సోకినట్లు గుర్తించిన వారి సంఖ్య 81,093కు చేరింది. వీరిలో కేవలం 5,120 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 72,703 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న మరో తొమ్మిది మంది మృత్యువాత పడడంతో మృతుల సంఖ్య 3,270కు పెరిగింది.

దేశం  బాధితులు మృతులు
ఇటలీ  59,138 5,476
చైనా 81,093 3,270
ఇరాన్‌ 21,638 1,685
స్పెయిన్‌ 28,768  1,772
ఫ్రాన్స్‌ 16,018  674
అమెరికా 33,546  419
భారత్‌ 390 07
ప్రపంచవ్యాప్తంగా 3,37,553

14,654 

ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారు:  98,884

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.